Natyam ad

సదుం, సొమల మండలాల్లో రాష్ట్ర మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన

సొమల ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం సదుం, సొమల మండలాల్లో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.దాదాపు 30 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లు, సచివాలయ భవనాలు, హెల్త్ క్లినిక్స్, బస్ షెల్టర్లు, షాది మహాల్స్ ప్రారంభం.రెండు మండలాల్లో కలిపి ఆరు నూతన సబ్ స్టేషన్లు ప్రారంభించిన మంత్రి. మూడు కోట్ల రూపాయలతో ఒక్కో సబ్ స్టేషన్ నిర్మాణం.సోమల లో 7.23 కోట్లతో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డు ను ప్రారంభించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.35 లక్షల రూపాయలతో నిర్మించిన దోబి ఘాట్, కమ్యూనిటీ హాల్ ప్రారంభం.సదుం లో 95 లక్షల రూపాయలతో నిర్మించిన షాది మహల్, సోమల మండలం కందూరు లో 51 లక్షల రూపాయలతో నిర్మించిన షాది మహల్ ప్రారంభం.అదే విధంగా 43.60 లక్షల తో నిర్మించిన మూడు సచివాలయాలు, 23.94 లక్షల తో నిర్మించిన ఆర్బిక్ తదితర భవనాలు ప్రారంభం

Post Midle

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

పుంగనూరు నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.వాటిని నేడు ప్రారంభించాం.మండలాల ప్రజలు అందరూ కూడా అభివృద్ధి పనులు చూసి చాలా సంతోషంగా ఉన్నారు.నేడు సదుం, సోమల మండలాల్లో నేడు 30 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించాం.పుంగనూరు నియోజకవర్గం ఎప్పుడూ లేనంతగా అభివృద్ధి చేసి చూపించాం.వైసిపి ను రానున్న ఎన్నికలలో ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్దం గా ఉన్నారు.సిఎం  వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తించారు.హంద్రీనీవా కాలువ పూర్తి కాలేదు అని చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పదేపదే విష ప్రచారం చేస్తున్నారు.ఇప్పటికే కుప్పం నియోజకవర్గం లో ఒక చెరువు కూడా నిండింది.వారు కాలువలో ధర్నాలు అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.ఒక టెక్నికల్ టీం ను తీసుకొచ్చి కాలువ పనులు పూర్తి అయ్యయో లేదో చూసుకోవాలి.

 

Tags: State Minister Peddireddy Ramachandra Reddy’s visit to Sadum and Somala mandals

Post Midle