Natyam ad

పుంగనూరు సీఐ గంగిరెడ్డికి రాష్ట్ర సేవా పథకం

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు అర్భన్‌ సీఐ ఎం.గంగిరెడ్డికి రాష్ట్ర సేవా పథకం అవార్డుకు ఎంపిక చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి హరిష్‌కుమార్‌గుప్తా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలో శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడంతో పాటు రహదారి ప్రమాదాల నివారణకు విశేష కృషి చేసిన సీఐ గంగిరెడ్డికి సేవా పథకం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కొత్తపల్లె చెంగారెడ్డి, అమ్ము తదితరులు సీఐకి అభినందనలు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. గంగిరెడ్డి మాట్లాడుతూ సేవా పథకం రావడంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని, పోలీస్‌శాఖకు మరింత మంచిపేరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. అవార్డు ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎస్‌ఐలు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

Post Midle

Tags: State Service Scheme for Punganur CI Gangireddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.