ఈనెల10న నంద్యాల జిల్లాలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన..
చెంచు కాలనీ సందర్శించి గిరిజనులతో ముఖాముఖి..
నంద్యాల ముచ్చట్లు:
గిరిజనుల సమస్యల పరిష్కరించేందుకు నేరుగా వారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి ఈనెల 10వ తేదీన జిల్లాలో ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభ రవిబాబు, కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అధికారికంగా జిల్లాలో పర్యటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ తెలిపారు.శుక్రవారం నంద్యాల పట్టణంలోని స్థానిక జిపిఎస్ కార్యాలయంలో వివిధ సంఘాల నాయకులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, నాలుగు రోజులు పాటుప్రకాశం జిల్లాలో ఎస్టి కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభ రవిబాబు పర్యటన ముగించుకొని ఈనెల 9వ తేదీన రాత్రి మహానందికి చేరుకొని 10వ తేదీ ఉదయం స్వామివారిని చైర్మన్ కుంభ రవిబాబు, కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ లు దర్శించుకుంటారు. కమిషన్కు ఫిర్యాదు చేసిన అర్జీదారులతో మాట్లాడతారు. చెంచు గుడాలు సందర్శించి, చెంచు గిరిజనుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.

అక్కడున్న సమస్యలను ఆరాతీసి అడిగి తెలుసుకోనున్నారు. 12 గంటలకు పాణ్యం మండలం నేరవాడ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో విజిట్ చేసి విద్యార్థినిలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అనంతరం గిరిజన సంఘ నాయకులతో, గిరిజన ప్రజలతో వినతలు స్వీకరిస్తారు. కావున ప్రతి ఒక్క గిరిజనుడు ఎస్టి కమిషన్ చైర్మన్ పర్యటనను సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బాలునాయక్, వెలుగోడు వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, కరివేన రవీంద్ర నాయక్, ఉపాధ్యక్షుడు మల్లేష్ నాయక్, ఎంపీటీసీ వెంకటేష్ నాయక్, మాజీ సర్పంచ్ బాలు నాయక్, సర్పంచ్ శివ నాయక్, విక్రమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Tags: State ST Commission Chairman’s visit to Nandyala district on 10th of this month.
