Natyam ad

అన్నదాత ఆనందంగా ఉంటేనే  రాష్ట్రం సుభిక్షం-జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

– ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి  డా సుధ

కడప ముచ్చట్లు:

Post Midle

అన్నదాత ఆనందంగా ఉంటేనే..రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుందని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు పక్షపాతి.. అని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, డా. సుధ లు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బహిరంగ సభ నుండి “వైఎస్ఆర్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజన” 4వ ఏడాది రెండవ విడత ఆర్ధిక సాయం మొత్తాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి.. రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా నుండి.. మైదుకూరు నియోజకవర్గ కేంద్రంలోని.. కె.ఎస్.సి. కన్వెన్షన్ హాలు నుండి.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తో పాటు.. మైదుకూరు, బద్వేలు ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, డా. సుధ, జేసీ సాయికాంత్ వర్మ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు.. ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, డా.సుధా, జేసీ సాయికాంత్ వర్మ లతో కలిసి.. జిల్లాలో “రైతు భరోసా- పిఎం కిసాన్ యోజన” పథకం క్రింద వరుసగా 4వ ఏడాది రెండవ విడతగా..  2,02,315 మంది రైతులకు మంజూరైన రూ.84,01,00,000 లు మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో అందజేశారు.అనంతరం మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామి రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న గత ప్రభుత్వ తీరును మార్చేసి… వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే “రైతు భరోసా” సాయం పథకాన్ని

 

 

 

ప్రభుత్వంఅమల్లోకితీసుకోచ్చారంటే.. ముఖ్యమంత్రికి  రైతులపై ఉన్న అభిమానం, శ్రద్ధ ఎంతటిదో అర్థమవుతోందన్నారు. ప్రతి ఏడాది రూ.13,500ల చొప్పున ఐదేళ్లలో రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందిస్తోందన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు గాను భూయజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ   రైతు బలంగా ఉండాలి. రైతు అన్ని విధాలా లాభపడాలనే సదుద్దేశంతో.. రాష్ట్ర.ప్రభుత్వం.. కృషిచేస్తోంది. జలయజ్ఞంలో భాగంగా.. జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటిమట్టంతో ఉన్నాయన్నారు. అన్నం పెట్టె అన్నదాత.. ఇచ్చేవాడుగానే వుండాలి తప్ప.. అర్థించే వాడుగా వుండకూడదనేదే.. రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచి, వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చేందుకు.. ప్రతి సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రాలు..సేవలందిస్తున్నాయన్నారు.
బద్వేలు ఎమ్మెల్యే డా.దాసరి సుధా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు గ్రామసీమల్లో రైతుల పాలిట దేవాలయాలుగావెలుగొందుతున్నాయన్నారు. మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్బికేలు జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో వ్యవసాయ పరిశోధకులను,అక్కడిప్రభుత్వాలను ఆకర్షిస్తున్నాయన్నారు.

 

 

అంతేకాకుండా కులం, మతం, ప్రాంతం.. అనే తేడాలేకుండా.. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్న ఘనత.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. అన్నిరకాల పథకాలకు మహిళలనే.. ప్రధాన లబ్ధిదారులుగా  చేశారన్నారు. అన్నదాతకు వెన్నుగా నిలిచిన ప్రభుత్వంగా దేశంలోనే గుర్తింపు తెచ్చిన మన ముఖ్యమంత్రికి అందరి తరపున ధన్యవాదాలుతెలుపుకుంటున్నామన్నారు.  జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ… రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రానున్న రబీ సీజన్ ఆరంబానికి ముందు.. రైతులకు సాగుబడి ఖర్చుల కోసం.. ఆర్థిక సాయం అందివ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు. వరుసగా 4వ ఏడాది  రెండవ విడత సాయంతో.. ఖరీఫ్ సీజన్ కు లబ్ధిదారుల సంఖ్య కూడా పెరగడం, సాగుబడి కూడా అనూహ్యంగా పెరగడం, దిగుబడులు కూడా చేతికి అందే దశకు చేరుకోవడం జరిగిందన్నారు. ఖరీఫ్ దిగుబడులను కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా.. ప్రభుత్వమే మంచి గిట్టుబాటు ధరతో ఆర్బికేల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తం చేస్తోందన్నారు. అర్హత ఉండీ “వైఎస్ఆర్ రైతు భరోసా” పథకం లబ్ది ఇంకను పొందని వారుంటే.. సంబందిత వార్డు లేదా గ్రామ వాలంటీర్లను, సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను, మండల వ్యవసాయ అధికారిని గానీ సంప్రదించాలన్నారు. ఆర్బికెల్లో.. నిరంతరం రైతులకు సలహాలు సూచనలు అందేలా.. కాల్ సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు.

 

Tags: State Subhiksham-District Collector V.Vijay Ramaraju only if the bread giver is happy

Post Midle