పార్లమెంట్‌ భవన్‌ ఆవరణలో ఎంపీలు ఎలాంటి నిరసన చర్యలు నిర్వహించరాదని పేర్కొంటూ ప్రభుత్వం …

జారీచేసిన నిరంకుశ ఆదేశాలు అప్రజాస్వామికం.
కామనురు. శ్రీనువాసులురెడ్డి…

కడప ముచ్చట్లు:

 

కడప నగరంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కామనురు శ్రీనువాసులురెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షుడు  మాట్లాడారు   పార్లమెంట్‌ భవన్‌ ఆవరణలో ఎంపీలు ఎలాంటి నిరసన చర్యలు నిర్వహించరాదని పేర్కొంటూ ప్రభుత్వం జారీచేసిన నిరంకుశ ఆదేశాలు అప్రజాస్వామికం. వాక్ స్వాతంత్ర్యం ,వ్యక్తిగత స్వేచ్ఛ హరించడమే , దేశానికి, ప్రజలకు సంబంధించిన అన్ని కీలకమైన అంశాలపై తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఎంపీలు సాధారణంగా నిరసన కార్యాచరణ చేపడుతూ ఉంటారు. భారత పార్లమెంట్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇది వారి ప్రజాస్వామ్య హక్కుగా వుంది
పార్లమెంట్‌లో ఉపయోగించకూడని పదాల జాబితాను పెంచుకుంటూ కొత్తగా ఆదేశాలు జారీ చేయడంతో పాటు, నిరసనలను నిషేధిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు పార్లమెంట్‌పై జరిగిన అత్యంత దారుణమైన నిరంకుశ దాడి. అంతేకాదు, పార్లమెంట్‌ స్వతంత్ర పనితీరుపైన, పార్లమెంట్‌ సభ్యుల నుంచి విడదీయలేని హక్కుల పైన జరిగిన దాడిగా చూడాలి.

 

ప్రభుత్వం ‘అసమర్థంగా’ వ్యవహరిస్తోందని చాలా తరచుగా వ్యాఖ్యానిస్తూ వుంటారు. ఇప్పుడు ఆ అసమర్థత అనే పదం కూడా ఉపయోగించకూడని పదమై పోయింది. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీలను సంప్రదించకుండా, ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామికం. పైగా పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఈ చర్య తీసుకోవడం మరీ దారుణం.ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలి.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మహాబుతార ,రాజేష్, సుబ్బారాయుడు తదితరులు పాల్గొననున్నారు.

 

Tags: Stating that the MPs should not hold any protest activities in the Parliament Bhavan premises, the government…

Leave A Reply

Your email address will not be published.