పెంపుడు శునకానికి విగ్రహం
విజయవాడ ముచ్చట్లు:
మానవ సంబంధాలు మంట కలుస్తున్నా నేటి తరుణంలో…… 9 సంవత్సరాలు పాటు సొంత బిడ్డలా ఎంతో అప్యాయంగా పెంచిన శునకం చనిపోతే గుర్తుగా విగ్రహం నిర్మించటం కాక 6 ఏళ్ల పాటు మనుషులకు జరిపినట్లు మాదిరిగా ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం కి చెందిన జ్ఞాన ప్రకాశరావు వ్యవసాయం , పాడి పోషణ చేస్తూ జీవనం సాగిస్తుంటారు. తనకి ఉన్న ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. ఒంటరిగా ఉంటున్న జ్ఞానప్రకాశరావు దంపతులు ఓ శునకాన్ని పెంచారు. రోజురోజుకు శునకం జ్ఞానప్రకాశరావు ఇద్దరు పై మాగజీవం చూపించే విశ్వాసం మరింత ప్రేమ పెంచుకున్నారు.. జ్ఞానప్రకాశరావు ఏదైనా పనిమీదా బయటకు వెళ్లితే వచ్చే వరకు కనీసం అన్న పానీయాలు ముట్టుకునేది.

ప్రకాశరావు తో రోజు వ్యవసాయ పనుల కోసం పొలం పనులకు వెళ్లేది. సొంత కొడుకు లాగ పెరిగిన కుక్క అకస్మాత్తుగా చనిపోవటంతో విషాదం లో మునిగిపోయారు. మనషులకు జరిపినట్లు కర్మకాండలు నిర్వహించాడు 200 పైగా బంధువులు ,గ్రామస్తులకు భోజనాలు పెట్టాడు. అమూగజీవం ఉంచిన జ్ఞాపకాలను మరిచిపోలేక ప్రతి యేట వర్ధంతి నిర్వహిస్తున్నాడు. గత ఏడాది 5వ వర్ధంతి నాడు ఇంటి ముందు కుక్క విగ్రహం ఏర్పాటు చేసి మూగజీవాల పట్ల తనకున్న విశ్వాసాన్ని చాటుకున్నాడు. సొంత కుటుంబ సభ్యుల చనిపోతే పట్టించుకోని ఈ రోజుల్లో స్వంత బిడ్డలా సాకిన జ్ఞానప్రకాశరావు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Tags: Statue of a pet dog
