రత్నాపూర్ లో మొహర్రం వేడుకలు-పాల్గొన్న సర్పంచ్ ప్రతిమ

కమాన్ పూర్ ముచ్చట్లు:

రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో శుక్రవారం మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పీరీలతో ఊరేగింపు నిర్వహించారు. పూజలలో సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు, ఉపాధి ఏపిఓ పల్లే మంజుల తిరుమల రావు, అంగన్వాడీ టీచర్ పల్లె అమర పాల్గొని పూజలు నిర్వహించారు.గ్రామంలో పీరీలు పట్టుకొని డప్పులు , వాయిద్యాలతో  ఊరేగింపుగా గడప,గడపకు భక్తులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎండి రహీమ్, ధర్ముల సంజీవ్ కుమార్, కండె కిష్టయ్య, లింగాల వినోద్, ఉడుత అనిల్, కండె గట్టయ్య, కెక్కర్ల రాములు , కొండ శంకర్, సాగర్ల శ్రీకాంత్, కెక్కర్ల నగేష్, కెక్కర్ల చిన్న సమ్మయ్య,ఎండి ఫజల్, కెక్కర్ల శివ,ధర్ముల కుమార్,కెక్కర్ల కృష్ణ,ఉడుత మల్లేష్,సాగర్ల ప్రసాద్ పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

 

Tags: Statue of Sarpanch who participated in Moharram celebrations in Ratnapur

Leave A Reply

Your email address will not be published.