పుంగనూరులో యోగాతో ఆరోగ్యవంతులుగా ఉంటారు

పుంగనూరు ముచ్చట్లు:

ప్రతి ఒక్కరు నిత్యజీవితంలో యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా కోర్టు ఆవరణంలో న్యాయమూర్తిలు కార్తీక్‌, సిందు , న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌తో కలసి యోగాసనాలు చేశారు. అలాగే మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌, ప్రభుత్వ ఆసుపత్రి కమిటి చైర్మన్‌ డాక్టర్‌ శరణ్‌, ప్రభుత్వ హ్గమియో డాక్టర్‌ గౌరిశ్రీ ఆధ్వర్యంలో పిజిఎస్‌ కళ్యాణ మండపంలో యోగా శిభిరం నిర్వహించారు. అలాగే శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ రాజశేఖరయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి యోగా శిక్షణ చేపట్టారు. ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , ఎంపీడీవో లక్ష్మీపతి ఆధ్వర్యంలో సచివాలయాలలో యోగా శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సిఆర్‌.లలిత, కౌన్సిలర్‌ జయభారతి, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags; Stay healthy with yoga in Punganur

Post Midle
Natyam ad