డ్రగ్స్ పై ఉక్కు పాదం .

హైదరాబాద్ ముచ్చట్లు:
 
హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అయిన ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులు పట్టుబడుతూనే ఉన్నారు. ఇటీవలే బిజినెస్ మన్ లు వైద్యులు, ఇప్పుడు తాజాగా ఐ టి ఎంప్లాయిస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న సిటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులకు పట్టుబడ్డారు. డ్రగ్స్ కేసులో ఎవరి ప్రమేయం ఉన ఎంతటి వారినైనా వదిలేది లేదని నగర పోలీస్ బాస్ హెచ్చరించారునార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విసిరిన వలలో ఈ సారి డ్రగ్స్ సేవిస్తూ డ్రగ్స్ విక్రయస్తు ఐ టీ ఎంప్లాయిస్ తో పాటు హైదరాబద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పట్టుబడ్డారు. ప్రధానంగా డార్క్నెట్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుందన్న విషయాన్ని గుర్తించిన నార్కోటిక్ అధికారులు.. ఎట్టకేలకు మూడు గ్యాంగ్లను అరెస్ట్ చేశారు. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులకు పట్టుబడిన వారిలో విద్యార్థులు, ఐ టి సెక్టార్ లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారే అధికంగా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు.హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న మూడు ముఠాలను నార్కోటిక్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. డార్క్‌నెట్‌లో నిఘా పెట్టిన నార్కోటిక్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్. అరెస్ట్ చేసిన వారిలో. నిందితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పీజీ, ఇంజినీరింగ్ బి టెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఇదివరకు మానవీయ కోణంలో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టిన పోలీసులు ఈ సారి ఈ కేసులో ప్రమేయం ఉన్న 11 మందిని అరెస్ట్ చేశారు అందులో 7గురు స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కేసులో ఓ విద్యార్థిని పరారీలో ఉంది.డార్క్‌నెట్ ద్వారా వినియోగదారులు డ్రగ్స్ తెప్పిచుకుంటూ పట్టుబడకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఎల్‌ఎస్‌డీ మాదకద్రవ్యాలను వాడుతున్నట్లు పోలీసులు గుర్తించరు. వీటిని పోస్టు, కొరియర్‌ ద్వారా తెప్పించుకుంటున్నారు స్టూడెంట్స్. పట్టుబడిన ముఠాలో నైజీరియన్ దేశస్తుడు ఉన్నాడు. ఆ దేశస్థులు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పరిశీలనలో తేలిందని వెల్లడించారు నగర సిపి. వీసా గడువు ముగిసిన ముంబాయి లో ఉంటున్నారని.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని నగర సిపి ఆనంద్‌ తెలిపారు. డ్రగ్స్ తీసుకునే వాళ్లు కార్పొరేట్ కంపెనీలో మంచి స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయ విశ్వ విద్యాలయాల్లో కొంత మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారని.. ఆయా యూనివర్శిటీల దృష్టికి తీసుకెళ్లామని సిపి స్పష్టం చేశారు.
 
Tags:Steel foot on drugs.

Leave A Reply

Your email address will not be published.