Natyam ad

స్టీల్ ప్లాంట్ కొనుగోళ్లు… నిబంధనాల ట్విస్ట్

విశాఖపట్టణం ముచ్చట్లు:


విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు ఆసక్తి చూపుతున్న తెలంగాణకు కేంద్రం నిబంధనల ట్విస్ట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థ కొనుగోలు చేసేందుకు లేదని నిబంధనలు చెబుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు మూలధనం సమకూర్చేందుకు యాజమాన్యం జారీచేసిన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌(ఈవోఐ) బిడ్ గడువును మరో ఐదు రోజులు పొడిగించింది. శనివారం మధ్యాహ్నంతో ముందుగా నిర్ణయించిన గడువు పూర్తికావడంతో… మరో ఐదు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకూ 21 సంస్థలు బిడ్ దాఖలు చేసినట్లుగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలిపింది. ఐదు రోజుల పొడిగింపు ఇవ్వడంతో ఈ నెల 20 మధ్యాహ్నం మూడు గంటల వరకూ బిడ్ వేసేందుకు చాన్స్ ఉంది. స్టీల్ ప్లాంట్ బిడింగ్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. ఇరవై కిలోమీటర్ల పాటు ఉక్కు పరిశ్రమ కార్మికులతో ర్యాలీ చేసిన ఆయన… రెండు సీల్డ్ కవర్లలో బిడ్ పత్రాలు దాఖలు చేశారు. క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా ప్రజల మద్దతుతో స్టీల్ ప్లాంట్ మూలధనం సేకరిస్తామని లక్ష్మీనారాయణ తెలిపారు. నెలకు రూ. 850 కోట్లు ఉంటే స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకుంటుందన్నారు.

 

 

 

స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట నుంచే విరాళాలు సేకరిస్తామన్నారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థ కొనుగోలుపై కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వులు అది సాధ్యంకాదని చెబుతున్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇతర ప్రభుత్వ సంస్థ… కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కొనడం కుదరదని కేంద్రం నిబంధన పెట్టింది. స్టీల్ ప్లాంట్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొనడానికి ముందుకొచ్చినా అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణ ప్రయత్నాలకు కేంద్రం మరోసారి అడ్డుకట్ట వేసిందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ, ప్రైవేటీకరణపై 2022లో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా… ప్రైవేటీకరణపై ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్డింగ్ కు ఇంట్రెస్ట్ చూపించింది. సింగరేణి అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులతో సమావేశం అయ్యి బిడ్డింగ్ వివరాలు సేకరించారు.

 

 

 

Post Midle

అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో తెలంగాణ కొనుగోలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఒక వేళ తెలంగాణ కేంద్రం అనుమతి కోరితే అవకాశం ఉండవచ్చని సీనియర్ అధికారులు అంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వార్ నడుస్తున్న కారణంగా ఇందుకు కేంద్రం అనుమతి ఇచ్చే అవకాశంలేదని సమాచారం.విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థ ఇంకా బిడ్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బిడ్ దాఖలు సమయాన్ని పొడిగించినట్లు స్టీల్ ప్లాంట్ అధికారులు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఈవోఐ బిడ్ దాఖలుకు ఆరు అంతర్జాతీయ స్టీల్ ఎక్స్ పోర్టర్స్ ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సంస్థ కూడా దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ సంస్థకు చెందిన ప్లాంట్లు మూతపడ్డాయి. దీంతో మూలధనం కింద నిధులు సమకూర్చి స్టీల్ తీసుకోవడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఉక్రెయిన్ సంస్థ జె.ఎస్.పి.ఎల్… పెంతర్ బ్రాండ్ వేసుకుని ఉక్కు అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతోంది. అలాగే జేఎస్.డబ్ల్యూ, ఎంఎస్ అగర్వాల్, వైజాగ్ ప్రొఫైల్ , నారాయణ ఇస్పాత్ వంటి పలు సంస్థలు ఈవోఐ బిడ్ లు దాఖలు చేశాయి.

 

Tags: Steel plant acquisitions…a twist on the rules

Post Midle