10 శాతం తగ్గిన స్టీల్ ధరలు

ముంబై  ముచ్చట్లు:


ప్రజలు వినియోగించే కీలక వస్తువులు, కొన్ని పారిశ్రామిక వస్తువుల ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలతో ఉక్కు ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇండోనేషియా విధించిన ఆంక్షల కారణంగా సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్ వంటి ఎడిబుల్ ఆయిల్‌ల హోల్‌సేల్ ధరలు సైతం ప్రభుత్వ చర్యలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇది కొన్ని అడ్డాలను ఎత్తివేసింది. మే 22 – జూన్ 8 మధ్య కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించడం లేదా పెంచడం వల్ల గాల్వనైజ్డ్ ప్లెయిన్ షీట్స్, కాయిల్స్ ధర 10% వరకు తగ్గిందని ప్రభుత్వ ఏజెన్సీల డేటా ప్రకారం తెలుస్తోంది. అదేవిధంగా.. TMT స్టీల్ బార్ల ధరలు దాదాపు 9. 3% తక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో ఇతర ఉక్కు ఉత్పత్తుల ధరలు సైతం భారీగానే తగ్గాయి.ఎడిబుల్ ఆయిల్ విషయానికొస్తే.. సోయా, సన్ ఫ్లవర్ నూనెల టోకు ధరల్లో క్షీణత ఇప్పటివరకు కేవలం 1. 5-2% మాత్రమే. రానున్న రోజుల్లో ఇవి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి ఆర్థిక, వాణిజ్య & పరిశ్రమ మంత్రిత్వ శాఖలు దీనిని పర్యవేక్షిస్తున్నాయి. ప్లాస్టిక్ పరిశ్రమ ఉపయోగించే ముడిసరుకు, ఇన్‌పుట్‌ల కోసం సుంకం కోతలు ఇప్పటివరకు ప్రభావం చూపనప్పటికీ, కొన్ని వారాల్లో దీని ప్రభావం కనిపిస్తుందని పరిశ్రమ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. కేంద్రం తీసుకున్న చర్యలు కొన్ని విభాగాల్లో ధరలు తగ్గుముఖం పట్టాయని ఆర్థిక నిపుణులు తెలిపారు. సుంకాల తగ్గింపు కారణంగా పప్పు ధాన్యాల ధరలు సైతం తగ్గాయి. పప్పు దినుసులు దిగుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుందని క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది.

 

Tags: Steel prices down 10 percent

Post Midle
Post Midle
Natyam ad