Date:05/12/2020
నంద్యాల ముచ్చట్లు:
ప్రజా సమస్యలపై దశల వారీ పోరాటాలు నిర్వహిస్తామని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ బాబా ఫక్రుద్దీన్ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ తెలిపారు. శనివారం నాడు
సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో విష్ణు అద్యక్ష తన తో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో . ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగ రాముడు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సుబ్బరాయుడు. రైతు సంఘం కార్యదర్శి సోమన్న. సిపిఐ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి షరీఫ్ భాష. ఏ ఐ టి యు సి అధ్యక్షుడు శ్రీనివాసులు. ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి సురేష్. ఏఐవైఎఫ్ మహానంది మండల కార్యదర్శి రవి. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు మహమ్మద్. ఆటో యూనియన్ నాయకులు సెక్ష. తదితరులు పాల్గొన్నారు .
అనంతరం సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ బాబా ఫక్రుద్దీన్ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాలలో ఇల్లు లేని నిరుపేదలు అనేక మంది ఉన్నారని వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఉద్యమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా టిడ్కో గృహాల వద్ద మౌలిక వసతులు కల్పించి బాధితులకు ఇవ్వాలని ఈనెల 14వ తారీఖున మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. .ఉపా చట్టంపై అవగాహన కోసం ఈనెల 18 వ తారీఖున అన్ని రాజకీయ పార్టీలతో ప్రజా సంఘాలతో విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి
Tags: Step-by-step movements on public issues