స్టీఫెస్ హాకింగ్ కన్నుమూత

Date:14/03/2018
లండన్ ముచ్చట్లు:
 ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు.. విశ్వం రహస్యాలను తెలుసుకోవడానికి ఆయన అనేక పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా హ్యాకింగ్ చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. వ్యాధి కారణంగా క్రమంగా పక్షవాతానికి గురైన ఆయన దశాబ్దాలుగా కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. కదల్లేని స్థితిలోనూ విశ్వ పుట్టుక, కృష్ణ బిలాలకు సంబంధించి మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేశారు.ఎంతో కాలంగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతూ చక్రాల కుర్చీకే పరిమితమైన స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. స్టీఫెన్ హాకింగ్స్ తన ఖగోళ సిద్ధాంతాలతో ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. 1942, జనవరి 8న ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫోర్డ్ షైర్ లో జన్మించిన ఆయన సెయింట్ ఆల్బన్స్ స్కూల్ లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం… ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు. మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా… చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా… కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం.. అందరికి  ఆదర్శం.ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే…ఆపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో బీఏ, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. హాకింగ్ రేడియేషన్, పెన్ రోజ్, హాకింగ్ ఫార్ములా, హాకింగ్ ఎనర్జీ, గిబ్సన్స్ – హాకింగ్ అన్సాట్జ్, ధ్రోన్ హాకింగ్ ప్రీస్కిల్ బెట్ వంటి ఆయన సిద్ధాంతాలు ఉత్సాహిక శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి.  స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయనప్పటికి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందించి… 2009లో ఆ పోస్టు నుంచి వైదొలిగారు. వచ్చే 500 సంవత్సరాల్లో భూమిపై జరిగే అంతరిక్ష తరంగాల దాడిని మానవులు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు స్టీఫెన్ హ్యాకింగ్ . భూమ్మీద మనిషి నివసించే స్థలం తరగిపోతోందని… ఇతర ప్రపంచాలలోకి మనం వెళ్లక తప్పదు. సౌర వ్యవస్థలను ఈ లక్ష్యంతోటే మనం అన్వేషించాల్సి ఉందని చెబుతున్నారు. ఇదొక్కటే మనల్ని మనం కాపాడుకునే మార్గం. బతికి బట్టకట్టాలంటే మనుషులు భూమిని వదిలిపెట్టి వెళ్లాల్సిందే అంటూ స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు.దశాబ్దాలుగా కంప్యూటర్ సహాయంతోనే హ్యాకింగ్ సైగలను మాటలుగా మార్చి అర్థం చేసుకుంటున్నారు. శరీరం సహకరించని స్థితిలోనూ కృష్ణ బిలాలపై ఆయన చేసి పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చూపాయి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా ఆయన సేవలందించారు.1970 నుంచి హ్యాకింగ్ కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. వ్యాధి ముప్పు వల్ల శరీరం రోజు రోజుకూ క్షీణిస్తున్నా.. అవిశ్రాంతంగా పరిశోధనలు జరిపి కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971 నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు.1984లో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫై టైమ్’ అనే పుస్తక రచన మొదలుపెట్టారు. ఆ సమయంలోనే వ్యాధి కారణంగా మరుసటి ఏడాది వైద్య చికిత్స తీసుకున్నారు.అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ రూపొందించుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో వెలువడింది. ‘కాలం కథ’ పేరుతో తెలుగులోనూ ఈ పుసక్తాన్ని తీసుకొచ్చారు.1965లో జేన్ విల్డీని వివాహం చేసుకున్న ఆయన, 1995లో విడాకులు ఇచ్చి అదే సంవత్సరం ఎలానీ మాసన్ ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు 2006లో విడాకులు ఇచ్చారు. హాకింగ్స్ కు ముగ్గురు పిల్లలు. ఆయన మృతితో శాస్త్ర సాంకేతిక సమాజం తీవ్ర విషాధంలో మునిగింది. భూమ్మీద మనిషి నివసించే స్థలం తరగిపోతోందని… ఇతర ప్రపంచాలలోకి మనం వెళ్లక తప్పదు. సౌర వ్యవస్థలను ఈ లక్ష్యంతోటే మనం అన్వేషించాల్సి ఉంది. ఇదొక్కటే మనల్ని మనం కాపాడుకునే మార్గం.  బతికి బట్టకట్టాలంటే మనుషులు భూమిని వదిలిపెట్టి వెళ్లాల్సిందే అంటూ స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. భూమిని వదిలిపెటడం ఏమంత కష్టమైన పని కాదు. దేశాలు పరస్పరం సహకరించుకుంటే మానవులు చంద్రుడిపై 30 ఏళ్లలో కాలనీలు నిర్మించుకోగలరు. మరో 15 సంవత్సరాలలోనే అంగారక గ్రహంపై అడుగు పెట్టగలరు. అక్కడినుంచి కొన్ని దశాబ్దాల వ్యవధిలో ఇతర ప్రపంచాలకు ప్రయాణించగలరు అని స్టీఫెన్ హ్యాకింగ్ భవిష్యద్దర్శనం చేయించారు.చంద్రమండలంపై ఒక మానవ గ్రామాన్ని నిర్మించడానికి 20 ఏళ్ల సమయం పడుతుందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2016లో ఒక ప్రకటన చేసింది. ఇక 2030 నాటికి అంగారక గ్రహంపైకి నేరుగా మనిషిని పంపించడానికి నాసా దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తోంది. 1972లో మనిషి చివరిసారిగా చంద్రుడిపై అడుగుపెట్టాడు. చంద్రుడిని చివరిసారి దర్శించిన అంతరిక్ష యాత్రికుడు యూజిన్ జెమెన్ ఈ జనవరిలో మరణించారు. చివరివరకు ఆయన అంతరిక్ష యాత్రలకు జీవితకాల సలహాదారుగా ఉన్నారు.  స్టీఫెన్ హ్యాకింగ్ అటు భూమండలం అంతర్ధానాన్ని, ఇటు శాస్త్రీయ ఆశావాదాన్ని కలిపి మానవులు భూమిని పదిలిపెట్టాల్సిందేనని చెప్పారు. నక్షత్రాల్లో నివాసం ఏర్పర్చుకోవాలంటే మనకు మరో వెయ్యి సంవత్సరాల సమయం మాత్రమే ఉందని పేర్కొన్నారు. వచ్చే వందేళ్లలోనే భూమిపై అనేక ప్రాంతాలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కోనున్నాయని, ఈ పరిస్థితిని ఊహిస్తూ భూమి మనిషి మనుగడకు కేంద్రంగా ఉంటుందనే ఆశాభావంతో తాను గడపలేనని హ్యాకింగ్ చెప్పారు. భౌతిక శాస్త్ర సూత్రాలు, సంభావ్యతా సూత్రాలు భూమిపై గ్రహశకలాల దాడి తప్పదని చాటి చెబుతున్నాయని, ఇంకా ధ్రువప్రాంతాల్లో మంచు కరిగిపోవడం, జంతు వినాశనం, భౌతిక వనరులు క్షీణించిపోవడం వంటివి భూమిపై మానవ మనుగడకు చెడు సంకేతాలను ఇస్తున్నాయని హాకింగ్ చెప్పారు భూమి చిన్నదైపోతోంది. భూతాపం పెనుప్రమాదంగా మారనుంది. వాతావరణ మార్పుపై చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామని…. మానవ భవిష్యత్తు గురించి, దాన్ని సాధించడానికి దీర్ఘకాలిక వ్యూహం గురించి ఆలోచిస్తున్నానని చెప్పారు. ఇప్పటినుంచే ఇతర ప్రపంచాలకు వెళ్లడంపై మనం దృష్టి  సారిద్దాం. భూమికి అతి సమీపంలో ఉన్న ప్రాక్సిమా సెంటారి నక్షత్రం మనకు 4.37 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇదే మనకు ఆశలు కలిగించే లక్ష్యం. కానీ ఇప్పుడున్న సాంకేతిక శక్తితో నక్షత్ర యాత్ర పూర్తిగా అసాధ్యం అని హాకింగ్ చెప్పారు.మానవజాతి మరో పది లక్షల సంవత్సరాలు మనగలగాలంటే ఇంతకు ముందు ఎవరూ చేరుకోలేని ప్రదేశాలను మనిషి ప్రయాణించడంపైనే ఆధారపడి ఉందని చెప్పారు.
Tags: Stephen Hawking passes away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *