Natyam ad

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి-సీపీఐ

నంద్యాల ముచ్చట్లు:


నంద్యాల పట్టణంలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డికి శనివారం నాడు వినతి పత్రం సమర్పించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ ఏఐవైఎఫ్ నాయకులు రవికుమార్ పట్టణ సిపిఐ శాఖ కార్యదర్శులు సహాయ కార్యదర్శులు పీఎం రమేష్ షహీన్ భాష దానం కలాం భాష మాట్లాడుతూ  నంద్యాల పట్టణంలోని 42 వార్డులలో కాలువలలో పూడికలు తీయకపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. అదేవిధంగా ఖాళీ స్థలాలలో వర్షపు నీరు నిలువ ఉన్నచోట దోమలు  వృద్ధి చెందుతున్నాయి. పట్టణములలో దోమలు వృద్ధి చెంది అక్కడి నివసించే వారికి కుట్టడం వల్ల వారు డెంగ్యూ మలేరియా విషజ్వరాలతో బాధపడుతున్నారు. ఈ దోమల కాటు వల్ల అంటు రోగాల బారిన పడి కూలి పనులు చేసిన డబ్బులు హాస్పిటల్లో ఖర్చులకే సరిపోతుందని తెలిపారు.  వెంటనే మున్సిపల్ అధికారులు పట్టణములోని అన్ని వార్డులలో కాలువలలో పూడికలు తీసి నిలువ ఉన్న నీటిని తొలగించి దోమల నివారణకు అన్ని ఏరియాలలో భాగింగ్ చేయాలని కమిషనర్ కు తెలపడమైనది.  కమిషనర్  మాట్లాడుతూ  మున్సిపాలిటీలోఆరు పాగింగ్ మిషన్లు ఉన్నవి  అందులో నాలుగు రిపేర్ లో ఉన్నవి వాటిని రిపేర్ చేయాలంటే గుంటూరు నుండి మనసులను తీసుకొచ్చి రిపేరు చేయించవలెను లేట్ అయినది తొందరగా వాటిని రిపేరు చేయించి అన్ని ఏరియాలలో దోమల నివారణకు పాగింగ్ చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కులాయి భారతీయుడు వలి రవి రాజు తదితరులు పాల్గొన్నారు..

 

Tags: Steps should be taken to prevent mosquitoes – CPI

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.