నకిలీలతో వాస్తవిక కళాకారులకు కలంకం-అధికారులు దృష్టి సారించాలి
నెల్లూరు ముచ్చట్లు:
దసరా దీపావళి శ్రీరామనవమి తదితర పండుగ దినోత్సవం ఆయా ప్రాంతాలలో పాటకచేరీల ద్వారా జీవనోపాధి అందిపుచ్చుకుంటున్న వాస్తవిక కళాకారులకు నకిలీల బెడద అధికంగా ఉందని దీంతో వాస్తు యొక్క కళాకారుల కళకు ఆటంకం ఏర్పడుతుందని నెల్లూరు జిల్లా సినీ ఆర్కెస్ట్రా మ్యూజిషియన్స్ అసోసియేషన్ కమిటీ పేర్కొంది. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్క్లబ్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కళ్లకు సంబంధంలేని కొంతమంది వీవెంట్స్ అనే పేరుతో పొరుగు రాష్ట్రాలైన బొంబాయి, ఒరిస్సా ,కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి అమ్మాయిలను వందల సంఖ్యలో నెల్లూరు నగరానికి తీసుకువచ్చి వారికి ఆసరా కల్పించి వారి చేత నృత్యాల పేరుతో అశ్లీల ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా అదే ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుందన్నారు. నకిలీ కళాకారులైన ఇటువంటి వారు అలాంటి ప్రదర్శనలు చేయడం వల్ల స్థానికంగా ఉన్న వాస్తవిక కళాకారులకు సమాజంలో గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయని తమ ఆవేదన వ్యక్తపరిచారు. దీనికి కళకు సంబంధం లేని నకిలీ కళాకారులు దళారులుగా ఏర్పడి కళా వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తున్నారని ఇటువంటి వారిపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ క్రమంలో నకిలీలను గుర్తించేందుకు నెల్లూరు జిల్లా సిరి ఆర్కెస్ట్రా మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఒక ప్రణాళిక చేయబడిందన్నారు. నెల్లూరు జిల్లాలో గుర్తింపు కలిగిన 47 సినీ ఆర్కెస్ట్రా జాబితాలో జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిస్తామని చెప్పారు. దీంతో నకిలీ కళాకారులు వాస్తవిక కళాకారులు ఎవరో తెలుసుకునేందుకు సులువుగా ఉంటుందన్నారు. జిల్లా అధికారులు యువత స్పందించి నిజమైన కళాకారుల జీవితాలలో వెలుగు నింపేందుకు సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో అధ్యక్షులు రాజశేఖర్, మాజీ అధ్యక్షులు కళాంజలి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు డీజే జీవన్, కార్యదర్శి కేదార్, కోశాధికారి రవితేజ, సంయుక్త కార్యదర్శి చిన్నబాబు, కార్యవర్గ సభ్యులు రాయల్ భాస్కర్, భాను కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Stigmatization of genuine artists with fakes—authorities should pay attention
