దొంగిలించిన ట్రాక్టర్ బోల్తా..వ్యక్తి మృతి
మెదక్ ముచ్చట్లు:
నిజాంపేట (మం) కల్వకుంట్ల గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందిన వ్యక్తి కేసు మరో మలుపు తిరిగింది. బోల్తా పడ్డ ట్రాక్టర్ ని గురువారం ఎవరో దొంగలించారని సిద్దిపేట జిల్లా భూంపల్లి పొలీస్ స్టేషన్ లో ట్రాక్టర్ యజమాని ఫిర్యాదు చేసాడు. శుక్రవారం ఉదయం కల్వకుంట్ల గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడి రాజు అనే వ్యక్తి మృతి చెందాడు .రాజునే ట్రాక్టర్ దొంగతనం చేశాడా..లేదా ఇంకెవరైనా చేయించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Stolen tractor overturned..Man died

