రాజేందర్ పై రాళ్ల దాడి
నల్గోండ ముచ్చట్లు:
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. మునుగోడు మండలం పలివెల గ్రామంలో ఈటల రాజేందర్ ప్రచారం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలు వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాల ఘర్షణతో పలివెలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Tags: Stone attack on Rajender

