వందే భారత్ ట్రైన్ పై రాళ్ల దాడి
విశాఖపట్నం ముచ్చట్లు :
విశాఖపట్నంలో వందేభారత్ ట్రైన్ పై రాళ్ల దాడి జరిగింది. ఘటనలో రెండు కోచ్ ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. రామ్మూర్తి పంతులు పేట గేట్ దగ్గర రాళ్లతో అగంతకులు దాడి చేశారు.ట్రయిల్ రన్ లో భాగంగా చెన్నై నుంచి విశాఖకు వెర్షన్ 2 వందే భారత్ రైలు వచ్చింది. ప్రధాని మోదీ ఈనెల 19 న సికింద్రాబాద్ లో ప్రారంభించాల్సిన రైలు ఇదే కావడం గమనార్హం. కాగా.. నిర్వహణ పర్యవేక్షణ కోసం వందేభారత్ రైలును విశాఖపట్నం రైల్వే స్టేషన్కు తీసుకువచ్చారు.
ఘటనపై స్పందించిన విశాఖ నగర పోలీసులు జి.ఆర్.పి.ఎఫ్ కు, ఆర్.పి.ఎఫ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ సిహెచ్. శ్రీకాంత్ నిందితులు గుర్తించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయటంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతో ప్రతిస్టాత్మాకంగా ప్రారంభమైన వందే భారత్ రైలు పై ఇటువంటి సంఘటన జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లుగా విశాఖపట్నం సిపి చెపుతున్నారు.
Tags; Stone attack on Vande Bharat train

