Stoning of poor houses

పేదల ఇళ్ల స్థలాల స్టోనింగ్ వేగవంతం

Date:03/12/2019

జంగారెడ్దిగూడెం ముచ్చట్లు:

వచ్చే ఉగాధినాటికి అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీచేసేందుకు వీలుగా లబ్దిదారుల సంఖ్యనుబట్టి భూములు లేఅవుట్ చేసి స్టోనింగ్ పూర్తిచేసి సిద్దంగా వుంచాలని అధికారులను జిల్లా కలెక్టర్  రేవు ముత్యాల రాజు ఆదేశించారు. జంగారెడ్దిగూడెం ఆర్ డిఒ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఆర్ డిఒ, తాహసిల్దార్లు, సర్వే, గృహనిర్మాణశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వచ్చే ఉగాధికి పేదలకు ఇళ్లస్థల పట్టాలు పంపిణి కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలన్నారు. జంగారెడ్ది గూడెం డివిజన్ లో అర్హులైన లబ్దిదారుల సంఖ్యను బట్టి భూమి సేకరణ, అవసరమైన భూముల లెవెలింగ్ , లేఅవుట్, స్టోనింగ్ తోపాటు అప్రోచ్ రోడ్లు పూర్తిచేసి సిద్దంగా వుంచాలన్నారు. ఉగాదిరోజున ఇళ్లస్థలాలు పంపిణీ కార్యక్రమం సజావుగా జరగాలన్నారు. జంగారెడ్దిగూడెం డివిజన్లో లబ్దిదారులకు అవసరమైన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటుందని, ప్రయివేటు భూమి సేకరణ అవసరం ఉండబోదని కలెక్టర్ చెప్పారు. ఒక్కొ గ్రామంలో ఎంతమంది లబ్దిదారులు వున్నారు? ఎంత భూమి అవసరం నిర్దారించుకుని భవిష్యత్ లో నమోదుఅయ్యే లబ్దిదారుల అవసరార్దం 10 శాతం అదనంగా భూమిని లేఅవుట్ చేసి సిద్దం చేయాలన్నారు. నాలుగు నెలలుగా వీడియో కాన్ఫరెన్స్ లు, సమావేశాలు నిర్వహించి చెపుతున్నప్పటికీ ఇంకా అవసరమైన భూమిని గుర్తించకపోవడం, లేవుట్ లు చేయకపోవడం పట్ల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని హితవుపలికారు. పనిచేయని అధికారులు జిల్లాలో ఉండనవసరంలేదని సర్వేయర్లు, తాహసిల్దార్లనుద్దేశించి కలెక్టర్ అన్నారు. ఈనెల 10వ తేదీన మళ్లీ సమావేశం నిర్వహిస్తానని అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలన్నారు.

 

 

 

 

 

 

 

 

అప్పుడుకూడా పనులు చేయకుండా సమావేశానికి ఊరకనేవస్తే మాత్రం కొంతమంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలకు అవినీతి రహిత సేవలు అందించడమే ముఖ్యమంత్రీ  వైఎస్ జగన్మోహన్ రెడ్ది లక్ష్యమని అధికారులు ఎవ్వరూ అవినీతిటి పాల్పడవద్దని సూచించారు. అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు ఎవరైనా ఆడియో లేదా వీడియో ద్వారా తనదృష్టికి తీసుకువస్తే వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటానన్నారు. అవసరమైతే అటువంటి అధికారులను ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తానని, భవిష్యత్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని కలెక్టర్ చెప్పారు. జంగారెడ్ది గూడెం ఆర్ డిఒ  ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ జంగారెడ్దిగూడెం డివిజన్లో 10997 మంది అర్హులైన లబ్దిదారులను గుర్తించామని చెప్పారు. 289 ఎకరాలు భూమి అవసరం కాగా, ఇప్పటికే 189 ఎకరాలు లే అవుట్ పూర్తిచేయడం జరిగిందన్నారు. మిగిలిన భూమి కోసం ఆక్రమణలో వున్న ప్రభుత్వ భూములు గుర్తించి స్వాధీనం చేసుకుని ఇళ్లస్థలాలకు అనువుగా వున్న వాటిని లేఅవుట్ చేయడం జరుగుతుందని ఆర్ డిఒ  ప్రసన్న లక్ష్మి వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్  ఎం వేణుగోపాల్ రెడ్ది, ఐటిడిఎ పిఒ  ఎవి సూర్యనారాయణ, ఎడి సర్వే  పివిఎన్ కుమార్ , గృహనిర్మాణశాఖ పిడి  ఎన్ రామచంద్రా రెడ్ది, తాహసిల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

 

అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం

 

Tags:Stoning of poor houses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *