Natyam ad

కొత్తూరు సెంటర్ వద్ద ఆకతాయిల అల్లరిని అరికట్టండి

కోనసీమల్లా ముచ్చట్లు:

 

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమల్లా ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ వద్ద ప్రతిరోజు ఆకతాయిల అల్లరి శృతి మించడంతో ఎంతో మంది విద్యార్థినులు ఆవేదనలకు గురవుతున్నందున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయవలసిందిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అఖిల భారత విద్యార్థి సమాఖ్య కన్వీనర్ రవికుమార్, సహాయ కార్యదర్శి కె వెంకట్ ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్ నాయక్ వినతి పత్రం సమర్పించారు. ఇదే ప్రాంతంలో జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఉన్నత పాఠశాల ఉందని ఈ విద్యాసంస్థలకు నిత్యం వందలాది మంది విద్యార్థినిలు వస్తూ ఉంటారని వారితో పాటే ఈ ప్రాంతానికి చుట్టుపక్క గ్రామాల మహిళలు వచ్చి బస్సులు ఎక్కుతూ ఉంటారని అన్నారు. అలాగే రవికుమార్ మాట్లాడుతూ కొంతమంది అబ్బాయిలు అక్కడ మహిళా విద్యార్థులు బసులు ఎక్కిదిగే సమయంలో కాలేజీలకి వెళ్ళే సమయంలో వెంబడిస్తూ వెకిలి చేష్టలు, ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులుగా మేము కూడా కొన్ని సంఘటనలు గుర్తించామని అన్నారు. ఇదే ప్రాంతంలో లైసెన్స్ లేకుండా మద్యం అమ్ముతున్న కొన్ని దుకాణాలు (మద్యం బెల్ట్ షాపులు) ఉన్నాయని, దీని కారణంగా సాయంత్రం సమయంలో విద్యార్థులు ఇంటికి చేరుకునే సమయంలో చాలా రద్దీ ఏర్పడుతుందని, కావున దయచేసి వాటిని నిశితంగా గమనించి విద్యార్థులను మద్యం బాబులు, అల్లరి మూకలు నుండి సురక్షితంగా వారి ఇళ్ళకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జూనియర్ కళాశాల కమిటీ సభ్యుల దృష్టికి ఈ సమస్యను తీసుకుని వెళ్లినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రవికుమార్, కో కన్వీనర్ వెంకట్, హిమ కుమార్, రాజు పాల్గొన్నారు.

 

Tags: Stop the hooligan rampage at Kothur Centre

Post Midle
Post Midle