చిప్ కోసం ఆగిపోయిన డెలివరీలు

ముంబై ముచ్చట్లు:

చేతిలో డబ్బులు ఉన్నా వెంటనే మనకు నచ్చిన బండి కొనే పరిస్థితి లేదు. వెహికల్ డెలివరీలు విపరీతంగా ఆలస్యమవుతున్నాయి.  ఇప్పుడు మీరు మారుతి ఎర్టిగా కొనాలంటే తొమ్మిది నెలలు ఎదురుచూడాలి.  మహీంద్రా ఎక్స్యూవీ700 కోసం రెండేళ్లు వేచి ఉండాలి. సెమీకండక్టర్ చిప్‌‌‌‌ల కొరతతో సహా ప్రపంచమంతటా సప్లై చెయిన్లలో ఇబ్బందుల  కారణంగా కార్ల కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనాకుతోడు ఉక్రెయిన్–-రష్యా యుద్ధం వల్ల చిప్ల సరఫరా మరింత దెబ్బతిన్నది. సెమీకండక్టర్ల కొరత మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు. ప్రీమియం వెహికల్స్  కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో వెహికల్స్ డెలివరీ ఆలస్యం ఎక్కువగా ఉంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) ప్రకారం, ఎక్స్ యూవీ700తోపాటు  హ్యుందాయ్ క్రెటా లేదా వెన్యూ (కొత్త వెర్షన్ త్వరలో వస్తుంది),

 

 

మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా థార్,  వెన్యూ వంటి బెస్ట్ సెల్లర్‌‌ల వెహికల్స్కు కనీసం ఆరు నెలల వెయిటింగ్ పీరియడ్‌‌ ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ లేదా శాంట్రో, మారుతి సుజుకి సెలెరియో లేదా వ్యాగన్ఆర్, టాటా టిగోర్ వంటి హ్యాచ్‌‌బ్యాక్/ సెడాన్ సెగ్మెంట్‌‌లో కొన్ని మోడల్‌‌లను డెలివరీ ఇచ్చేందుకు ఒకటి లేదా రెండు నెలలు పడుతోంది. చిప్ల కొరత 2023 వరకు ఉండొచ్చని కంపెనీలు చెబుతున్నాయి. వెహికల్ డెలివరీ తీసుకోవడంలో జాప్యం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, మహమ్మారి నేపథ్యంలో చాలా మంది సొంతంగా బండ్లు కొనుక్కుంటున్నారు. వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉన్నా ఆగుతున్నారు. ఫాడా ప్రెసిడెంట్ వింకేష్ గులాటి మాట్లాడుతూ బుక్ చేసిన వెహికల్స్క్యాన్సిలేషన్ రేటు మహమ్మారికి ముందు కాలంలో 5-6 శాతం ఉండగా ఇప్పుడు 8-9 శాతానికి పెరిగిందని అన్నారు. మనదేశంలో కార్ మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ కంపెనీకి దాదాపు 3,25,000 బుకింగ్‌‌లు పెండింగ్‌‌లో ఉన్నాయి.  అసెంబ్లీ కెపాసిటీ  ఇబ్బందుల కంటే సెమీకండక్టర్ కాంపోనెంట్‌‌ల సప్లై కొరత వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయని  మారుతీ సుజుకీ మార్కెటింగ్  సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ చెప్పారు.

 

Post Midle

Tags: Stopped deliveries for the chip

Post Midle
Natyam ad