Storm surge

 తుఫానుగా వాయుగండం

Date:24/11/2020

విశాఖపట్టణం ముచ్చట్లు:

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం తీవ్ర‌ వాయుగుండంగా మారి, తీవ్ర వాయుగుండం ఇప్పుడు తుఫానుగా మారింది. ఈ తుఫాను బుధ‌వారం సాయంత్రానికి పుదుచ్చేరి, త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల్లోని క‌రైకాల్‌, మామ‌ల్లాపురం మ‌ధ్య‌ తీరాన్ని తాకే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్ర‌భావంతో త‌మిళ‌నాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో ప్ర‌స్తుతం గంట‌ల‌కు 100-110 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయ‌ని, ఇవి గంట‌‌కు 120 కిలోమీట‌ర్ల‌కు పెరిగే అవ‌కాశం ఉన్న‌ద‌ని అధికారులు తెలిపారు. నివర్ తుఫానుగా పిలుస్తున్నఈ తుఫాను ప్ర‌భావంతో త‌మిళ‌నాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో ఇప్ప‌టికే వ‌ర్షాలు మొద‌ల‌య్యాయ‌ని, మ‌రో మూడు రోజుల‌పాటు ఈ వ‌ర్షాలు ఇలాగే కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ నెల 25, 26 తేదీల్లో ద‌క్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ‌, క‌ర్ణాట‌కల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

 

బీజేపీపై లక్ష చార్జీషీట్లు వేయాలి

Tags:Storm surge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *