Natyam ad

వ్యూహాలు ప్రతి వ్యూహాలతో  పార్టీల దూకుడు

అనంతపురం ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్  లో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అన్ని పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వ్యూహాల్లో కాస్త ముందే ఉంటోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఇప్పటికే గెలుపు గుర్రాల ఎంపికలో కసరత్తు మొదలెట్టారు. ఇందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పైనల్ చేస్తున్నారు. అదే క్రమంలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ‌  పై పోటీ చేసే అభ్యర్థిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే హిందూపురం  అంటే టీడీపీకి అడ్డగా చెప్పొచ్చు.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం ఆ పార్టీకి కంచుకోటలా మారింది. 1983 త‌ర్వాత ఇంత‌వ‌ర‌కు ఏ పార్టీ జెండా రెపరెపలాడడం లేదు. 1985, 1989, 1994 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు, దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు ఇక్క‌డి నుంచే పోటీచేసి విజ‌యం సాధించారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత 1996లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో త‌న‌యుడు హ‌రికృష్ణ పోటీచేసి గెలుపొందారు. 1999 నుంచి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఇత‌ర వ్య‌క్తులు పోటీచేసి విజ‌యం సాధిస్తూ వ‌చ్చారు.ఇక 2014 నుంచి బాలయ్య శకం మొదలైంది. మొదట 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తరువాత వైసీపీ సునామీ.. జగన్ ప్రభంజనం మధ్ కూడా 2019 ఎన్నిక‌ల్లో నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుస‌గా పోటీచేసి ఘ‌న‌విజయం సాధించారు. 2024లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాల‌నే లక్ష్యంతో ముందుకు వెళ్తారు.

 

 

అయితే బాలయ్య హ్యాట్రిక్ కు ఈ సారి చెక్ పెట్టాలని వైసీపీ అధినేత వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగరవేయడంతో.. అదే జోరు వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగించాలని ఎత్తులు వేస్తున్నారు.ఇటీవల ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంతో.. రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాధ‌వ్ ను ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి బ‌రిలోకి దింపే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే బాల‌కృష్ణ‌పై ధీటైన అభ్య‌ర్థి కోసం అన్వేషిస్తున్న వైసీపీకి మ‌హిళా అభ్య‌ర్థి అయితే విజ‌యావ‌కాశాలుంటాయ‌నే అంచనా వేస్తుంది. ఇందులో భాగంగా క‌ల్యాణ దుర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచ‌ర‌ణ్ పై బాధ్యత పెట్టబోతున్నట్టు సమాచారం.హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1955లో జరిగిన ఎన్నికలు మినహా ఇంత‌వ‌ర‌కు ప్రధాన పార్టీల త‌ర‌ఫున మ‌హిళలు పోటీచేయ‌లేదు. అందుకే ఈసారి ఎన్నిక‌ల్లో మ‌హిళ పోటీచేస్తే వారి ఓట్ల‌న్నీ పడే అవ‌కాశం ఉంద‌ని, అలాగే బాల‌కృష్ణ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌టంలేద‌ని.. ఆయనపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. అందుకే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హిందూపురం నుంచి బాల‌కృష్ణ మీద దాదాపుగా ఉషాశ్రీచ‌ర‌ణ్ పోటీచేయ‌డం ఖాయ‌మేన‌ని వైసీపీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

 

Post Midle

Tags: Strategies are the aggressiveness of the parties with each strategy

Post Midle

Leave A Reply

Your email address will not be published.