వీధి వ్యాపారుల షెడ్లను వెంటనే ప్రారంభించాలి
మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి
జగిత్యాల, ముచ్చట్లు:

వీధి వ్యాపారుల కోసం గొల్లపల్లి రోడ్డులో నిర్మించిన షెడ్లను వెంటనే ప్రారంభించి, వీధి వ్యాపారులకు అప్పగించాలని కోరుతూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బిజెపి నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణి గురువారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా శ్రావణి మాట్లాడుతూ రహదారుల వెడల్పు, వీధి వ్యాపారుల క్రమబద్ధీకరణలో భాగంగా పట్టణ ప్రగతి నిధులను వెచ్చించి పాత బస్టాండ్ నుండి గొల్లపల్లి రోడ్డులో వీది వ్యాపారుల కోసం కేటాయించే 37 షెడ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ కొన్ని రాజకీయ కారణాలవల్ల ఆ షెడ్ల ను ప్రారంభించకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణ ప్రగతి మరియు మెప్మా నిధుల ద్వారా నిర్మించవలసి ఉన్న మిగతా 23 షెడ్ల నిర్మాణాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని కోరారు.
ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన షెడ్ల ను వీధి వ్యాపారులకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేసి పట్టణం లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంతోపాటు వీధి వ్యాపారులకు చేయూతనివ్వాలని వినతి పత్రం లో కోరారు.
Tags; Street vendors’ sheds should be opened immediately
