పుంగనూరులో వీధి విక్రయదారులు అభివృద్ధి చెందాలి

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలోని వీధి విక్రయదారులు జగనన్నతోడు పథకం క్రింద తమంతకుతాముగా అభివృద్ధి చెందాలని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా కోరారు. బుధవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో జగనన్నతోడు పథకం క్రింద లభ్ధిదారులకు ఆర్థికసహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా చిత్తూరు ఎంపి రెడ్డెప్ప హాజరైయ్యారు. చైర్మన్‌ అలీమ్‌బాషా మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు పట్టణంలోని 639 మంది వీధివ్యాపారులకు రూ.63.90 లక్షలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఉంటే అందరికి తోడు పథకం క్రింద చేయూతనందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌తో పాటు పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Street vendors should be developed in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *