Natyam ad

బహుజన ఉద్యమాలను బలోపేతం చేయండి

-నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా పొన్నం ప్రసాద్ గౌడ్

కమాన్ పూర్ ముచ్చట్లు:

పెద్దపెల్లి జిల్లాలో బహుజన ఉద్యమాలను బలోపేతం దిశలో బహుజన ప్రతినిధులు సంఘటిత ఉద్యమాలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు  రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ బీసీ భవన్ లో జరిగిన పెద్దపెల్లి జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సమావేశ అధ్యక్షుడుగా జిల్లా జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ  అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి జిల్లా నూతన ప్రధాన కార్యదర్శిగా పున్నం ప్రసాద్ గౌడ్, జిల్లా మహిళ అధ్యక్షురాలుగా పెంచికల రమ్య యాదవ్ లు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన బీసీ గురుకులాలను మరియు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల స్కాలర్షిప్ పెంపొందించేలా ప్రభుత్వం పై ఒత్తిడి వచ్చేలా ఉద్యమాలు చేపట్టాలని ఆయన కోరారు.  ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్ లతోపాటు బొద్దుల అరుణ ,వింజమూరు సురేష్, సబ్బు సతీష్, రెడ్డి శేఖర్, నల్లవెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు

 

Post Midle

Tags: Strengthen mass movements

Post Midle

Leave A Reply

Your email address will not be published.