జనసేన పార్టీ బలోపేతం

Strengthen the Janasena Party

Strengthen the Janasena Party

Date:17/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరులో జనసేన పార్టీ బలోపేతమైందని పార్టీ అసెంబ్లి అభ్యర్థి రామచంద్ర యాదవ్‌ తెలిపారు. పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 200 మంది జనసేనలో చేరారు. వీరందరికి రామచంద్ర యాదవ్‌ పార్టీ కండువాలు కప్పి, పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన న్యాయవాది శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీకి చెందిన బీసీ నాయకుడు హేమంత్‌కుమార్‌, ఏఐటియుసి కార్యదర్శి వెంకట్రమణారెడ్డి, నాయిబ్రాహ్మణసంఘ నాయకుడు ప్రకాష్‌ తో పాటు సుమారు 200 మంది పార్టీలో చేరారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు జనసేన పార్టీ గుర్తు గ్లాసుపై ఓట్లు వేసి, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పుంగనూరు అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైబీమ్‌ యువకులు, మహిళలతో పాటు జైపాల్‌, ఈశ్వర్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

భక్తులకు అందుబాటులో శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగం

Tags:Strengthen the Janasena Party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *