బలపడిన అల్ప పీడనం

విశాఖపట్నంముచ్చట్లు:


దక్షణ అండమాన్ మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని వాతావరణ విభాగం ప్రకటించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు తప్పవని హెచ్చరిస్తోంది.
శనివారం నాటికి నైరుతి, ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు కురిసే అవకాశముంది. రాయలసీమ, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అలాగే చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించారు. కాబట్టి ప్రజలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం తెలిపింది.

 

Tags: Strengthened low pressure

Post Midle
Post Midle