పుంగనూరులో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం -కౌన్సిలర్‌ అమ్ము

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాకానుక కిట్లను గురువారం కౌన్సిలర్‌ అమ్ము పంపిణీ చేశారు. పట్టణంలోని ఉబేదుల్లాకాంపౌండు పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు జగనన్న విద్యాకానుక, అమ్మ ఒడి, పటిష్టంగా భోజన పథకం పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. అలాగే నాడు-నేడు పథకం క్రింద కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలను కార్పోరేట్‌ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిదేనని కొనియాడారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు.

 

Tags: Strengthening of government schools in Punganur – Councilor Ammu

Leave A Reply

Your email address will not be published.