శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట బందోబస్తు

Strengthening the protection of peacebuilding

Strengthening the protection of peacebuilding

Date:09/11/2019

భాకరాపేట ముచ్చట్లు:

అయోధ్య బాబ్రీ మసీదు వ్యవహారంలో కోర్టు ఇచ్చిన తీర్పును ప్రతి వ్యక్తి గౌరవించేలా ఉండాలని భాకరాపేట సబ్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ అన్నారు. శనివారం చిన్నగొట్టిగల్లు మండలం లో ఎస్ ఐ రవి నాయక్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా రవి నాయక్ మాట్లాడుతూ రాజకీయాలకు చరిత్రకు అతీతంగా కోర్టు తీర్పు వెలువడిందని, ఈ తీర్పును ప్రజలందరూ గౌరవించేలా ఉండాలని కోరారు. శాంతిభద్రతలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడం పోలీసుల కర్తవ్యం అని తెలియజేసారు. అలాంటి ప్రభుత్వ ఆస్తులను ఎవరైనా ధ్వంసం చేయాలని చూసినా ,నష్ట పరిచిన, శాంతిభద్రతలకు విఘాతం కల్పించినా ఎంతటి వారినైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఘంటాపదంగా తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు బస్టాండ్ లోనూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించి విధినిర్వహణలో తన చిత్తశుద్ధిని కనపరిచారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ లు మధుసూదన్, బాబురావు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

 

ఇమ్రాన్ స్పెషల్ ధ్యాంక్స్ : మోడీ

 

Tags:Strengthening the protection of peacebuilding

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *