కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు

ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా
*నెయ్యి తయారీ కేంద్రంలో తనిఖీలు

సామర్లకోట ముచ్చట్లు:


నూనె, నెయ్యి తయారీదారులు కల్తీకి పాల్పడితే సహించేది లేదని కాకినాడ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా పేర్కొన్నారు. సామర్లకోటలోని విజయ వెంకటేశ్వర లక్ష్మి ట్రేడింగ్ కో పేరుతో నిర్వహిస్తున్న నెయ్యి తయారీ కేంద్రంలో సోమవారం రాత్రి ఆయన తనిఖీలు నిర్వహించారు. కొంతకాలంగా బత్తుల వారి వీధిలో  ఓ ఇంట్లో తలుపులు మూసివేసి నెయ్యి తయారు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో తనిఖీలు చేశారు. మొదటగా నెయ్యి నింపి  ఉన్న డబ్బాలపై కృష్ణా మిల్క్ యూనియన్ పేరు ఉండటంతో ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రశ్నించారు. దీనిపై కేంద్రం నిర్వాహకులు బదులిస్తూ రీసైక్లింగ్ చేసిన డబ్బాలను వినియోగిస్తున్నామన్నారు. నెయ్యి ఉత్పత్తి చేస్తున్న డబ్బాలపై బ్యాచ్ నెంబర్, మాన్యుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్సపైర్ డేట్ ఉన్న లేబుల్ ఏదని మరో ప్రశ్నించడంతో నిర్వాహకులు కొంచెం తాత్సారం చేశారు. లేబుల్ లేకపోతే రూ.2లక్షలు జరిమానావిధించాల్సి ఉంటుందని హెచ్చరించడంతో ఒక డబ్బాపై లేబుల్ను అతికించి దానిపై మార్కర్ రాసి అధికారికి చూపించారు. అనంతరం రెండు కేజీల నెయ్యి శాంపిళ్లను సేకరించి పంచనామా తయారు చేశారు.

 

Tags: Strict action if adulterated

Leave A Reply

Your email address will not be published.