నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా బైంసా పట్టణ కేంద్రంలో వ్యవసాయ శాఖ ఏ డి ఏ వీణ, పట్టణ సీఐ శీను ఫర్టిలైజర్ షాప్ లను తనిఖీ చేశారు. మరోవైపు, బైంసా మండలంలోని పలు గ్రామాలలో రూరల్ సీఐ చంద్రశేఖర్
తనిఖీలు నిర్వహించారు. ఏడీఏ వీణ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. రైతులు విత్తనాలు తీసుకునే ముందు అవి నకిలీ విత్తనాలా, ఒరిజిలా అనితెలుసుకొని తీసుకోవాలని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం వస్తే పోలీసుల కైనా లేక అగ్రికల్చర్ అధికారులకైనా తెలియపరచాలని అన్నారు. రైతులు విత్తనాలు,ఎరువుల కొనుగోలుసమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పత్తి, కంది సాగు రైతులు ఏవోల. ఏఈవోల సలహాలను పాటించాలన్నారు. రైతులు ఖరీదు చేసిన ప్రతీ దానికి రసీదు ఇవ్వాలని దుకాణా యజమానులనుఆదేశించారు. ఆమె వెంట బైంసా ఏవో రామచంద్రనాయక్, పట్టణ సీఐ శీను పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:Strict action if fake seeds are sold

