రాజాసింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి

విజయవాడ ముచ్చట్లు:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అహ్లే సున్నత్ వాల్ జమాత్,  ముస్లిం సంఘాలు  పార్టీలకతీతంగా విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం పోలీసులకు వినతి పత్రం అందజేశారు
భారతదేశంలో మతసామరస్యాన్ని భంగం కలిగే విధంగా హైదరాబాదు నగరంలో  రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే గా ఉండీ  ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం అత్యంత భక్తితో ప్రేమించే మహమ్మద్ ప్రవక్త గారి పై అనుచిత వ్యాఖ్యలు చేయటం పై తీవ్రంగా ఖండిస్తున్నాం .దేశవ్యాప్తంగా ముస్లింసంఘాలే కాకుండా   సెక్యులర్ భావాలు కలిగిన ప్రజలు కూడా ఈ విషయంపై తీవ్రంగా ఖండిస్తున్నారు . గతంలో నుపుల్ శర్మ మొహమ్మద్ ప్రవక్త గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ మరో వ్యక్తి ఈ విధమైనటువంటి వివాదాస్పద భాష వాడేవారు కాదు ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ మళ్లీ అలాంటి సమస్య  ఎదురయ్యేది కాదు .కాబట్టి ఇప్పటికైనా ముస్లిం మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన రాజా సింగ్ పై కఠినమైన చర్యలు తీసుకొని దేశ ద్రోహం కేసు నమోదు చేసి మరొకసారి ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని తెలియజేస్తున్నాం  ఈ కార్యక్రమంలో రాష్ట్ర అహలె సున్నత్ జమాత్  కన్వీనర్ మౌలానా గౌహర్ ఆలం కో కన్వీనర్ అల్తాఫ్ రజా వైయస్సార్సీపి కార్పొరేటర్ మొహమ్మద్ ఇర్ఫాన్ ఫారుక్ షుబ్లీ ఫతావుల్లా జాకీర్ హుస్సేన్ హఫీజ్ సమద్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Strict action should be taken against Raja Singh

Leave A Reply

Your email address will not be published.