Date:25/01/2021
ఖమ్మం ముచ్చట్లు:
ఇటీవల కాలంలో ఖమ్మం గ్రెయిన్ మార్కెట్ లో కొద్ది మంది వ్యాపారస్తులు రైతులను, అడ్తి వ్యాపారులను మోసం చేసి కొన్న సరుకులకు డబ్బు చెల్లించకుండా పారిపోతున్నారని, ఇటువంటి వారి పై అధికారులు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ డిమాండ్ చేశారు.సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
రైతు, అడ్తి వ్యాపారుల వద్ద సరుకు కొని వివిధ కుంటి సాకులు చెప్పి డబ్బు లు ఎగ్గొట్టే పని చేస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన మోసం అని మార్కెట్ బైలా ప్రకారం మార్కెట్ సరుకుల కొని ఖాటాలు పూర్తి కాగానే వెంటనే డబ్బు చెల్లించాలి. కాని కొంతమంది లాభాలు వస్తే అనుభవించటం లేకపోతే ఇతర కారణాలు చూపించి పారిపోవడం మరలా కొంత కాలం తర్వాత తిరిగి మార్కెట్ లోకి వ్యాపారానికి రావడం జరుగుతుంది. వీరి పట్ల మార్కెట్ కమిటి, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఉదాసీనత విడనాడాలని పేర్కొన్నారు. పెట్టుబడి లేకుండానే ఇటువంటి వారు రైతు సరుకుతో, కమిషన్ వ్యాపారుల సోమ్ముతో వ్యాపారం చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే సిపిఎం, రైతు సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీ నివాసరావు, త్రీటౌన్ కార్యదర్శి తుశాకుల లింగయ్య, నాయకులు బండారు యాకయ్య లు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags: Strict action should be taken against those who cheat farmers and builders