Natyam ad

పోలింగ్‌లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

-ఓట్లు స్వేచ్చగా వేసేందుకు చర్యలు
– మొత్తం ఓటర్లు : 2,38,868
– పురుషులు :1,17,072
– స్త్రీలు :1,21,791
-ఆర్‌వో మధుసూదన్‌రెడ్డి

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

పుంగనూరు నియోజకవర్గంలో పోలీంగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆర్‌వో మధుసూధన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిస్టిబ్యూషన్‌ సెంటర్‌లో సిబ్బందికి ఈవిఎంలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌వో మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి 8 మంది పోటీలో ఉన్నట్లు తెలిపారు. ఇందుకు గాను 265 పోలీంగ్‌ కేంద్రాలలో  మొత్తం 2,38,868 ఓటర్లు తమ ఓటును వేయనున్నట్లు తెలిపారు. ఇందులో పురుషులు :1,17,072, అలాగే  స్త్రీలు :1,21,791, ట్రాన్స్ర్‌  జెండర్ లు 5 మంది ఉన్నారని తెలిపారు. పోలీంగ్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండ చర్యలు చేపట్టామన్నారు. పోలీంగ్‌ను వెబ్‌కాస్టింగ్‌, వీడియో రికార్డింగ్‌తో నమోదు చేస్తున్నామన్నారు. పోలీంగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేసి , సమస్యాత్మక గ్రామాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పూర్తి శాంతియుత వాతావరణంలో పోలీంగ్‌కు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సిబ్బంది…

నియోజకవర్గంలోని పుంగనూరు మున్సిపాలిటి, రూరల్‌ మండలం , చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లోని 265 పోలీంగ్‌ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను వెహోత్తం 1962 మందిని నియమించారు. ఇందులో పీవోలు, 289 మంది ఏపీవోలు , 312 మంది, ఓపివోలు 1245 మంది ఉన్నారు. సెక్టోరియల్‌ ఆఫీసర్లు 31 మంది, సూక్ష్మపరిశీలకులు 116 మందిని నియమించారు. 28 రూట్లు, 8 సెక్టార్‌ రూట్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో అన్ని పోలీంగ్‌ కేంద్రాలకు గాను వెహోత్తం పోలీసులు 638 మందిని నియమించారు. ఇందులో ఎస్పీ ట్రైనితో పాటు ఏఎస్పీ సుబ్బరాజు, డిఎస్పీ మహబూబ్‌బాషాతో పాటు 6 మంది సీఐలు, 7 మంది ఎస్‌ఐలు, 45 మంది ఏఎస్‌ఐలు ఉన్నారు. ప్రతి పోలీంగ్‌ కేంద్రానికి ఇద్దరు పోలీసులను నియమించారు.

తరలివెళ్లిన సిబ్బంది…

పుంగనూరు నుంచి ఆయా పోలీంగ్‌ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది, పోలీసులు తమ పోలీంగ్‌ సామాగ్రీని తీసుకుని బస్సుల్లో వెళ్లారు. పూర్తి భద్రత నడుమ పోలీంగ్‌ కేంద్రాలకు ఈవిఎంలను, వివిప్యాడ్లు తీసుకెళ్లారు. ఒకొక్క పోలీంగ్‌ కేంద్రంలో పీవో, ఏపీవోతో పాటు సహాయకులు నలుగురు వెళ్లారు. పోలీసులు ఒకొక్క కేంద్రానికి ఇద్దరు, నలుగురు చొప్పున నియమించారు.

చంటి బిడ్డలతో విధులకు….

పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల విధుల కోసం బయట ప్రాంతాల నుంచి చంటి బిడ్డలతో మహిళా ఉద్యోగులు హాజరుకావడం జరిగింది. ఎండ తీవ్రతకు తట్టుకోలేక చిన్నారుల కష్టాలు వర్ణణాతీతం. ఆ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం వారికి సహాయకులుగా రావడం జరిగింది.

Tags: Strict action will be taken if irregularities are committed in polling

Post Midle