పుంగనూరులో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు – కమిషనర్‌ నరసింహప్రసాద్‌ 

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలకు హానికలిగించకుండ పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరు పటిష్టంగా అమలు చేయాలని కమిషనర్‌ నరింహప్రసాద్‌ వ్యాపారులను హెచ్చరించారు. మంగళవారం ఆయన పట్టణంలోని చికెన్‌, మటన్‌ షాపులు , హ్గటళ్ళు తనిఖీ చేశారు. ప్లాస్టిక్‌ గ్లాసులు, కవర్లు వినియోగించరాదని తెలిపారు. అలాగే చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండ డస్ట్బిన్నుల్లో నిల్వ చేసి, మున్సిపల్‌ కార్మికులకు అందించాలన్నారు. దోమలు, ఈగలు వస్తువులపై పడకుండ ఉండేందుకు గ్లాసు బాక్సులను అమర్చుకోవాలన్నారు. పారిశుద్ద్య కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించడం, ట్రేడ్‌లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

Tags: Strict action will be taken if people are disturbed in Punganur – Commissioner Narasimhaprasad

Leave A Reply

Your email address will not be published.