Natyam ad

పెన్నా నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు

చెన్నూరు మండల తాసిల్దార్. పటాన్ అలీ ఖాన్

చెన్నూరు ముచ్చట్లు:

Post Midle

చెన్నూరు మండలం లో వివిధ గ్రామాల పరిధిలో ఉన్న పెన్నా నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెన్నూరు మండల తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్ పేర్కొన్నారు. శనివారం కొండపేట పెన్నా నది నుంచి ఎద్దుల బండ్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో పెన్నా నది లోకి వెళ్లే రహదారికి గేటు వేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ చెన్నూరు మండలం కనపర్తి వద్ద నిర్మాణంలో ఉన్న పక్కా గృహాలకు మాత్రమే ఇసుక తీసుకువెళ్లేందుకు అనుమతి ఇచ్చామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పెన్నా నది నుంచి ఇసుక తరలిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎద్దుల బండ్లు కానీ ట్రాక్టర్లు ఇసుక తీసుకువెళ్లేందుకు అనుమతి లేదన్నారు. వీఆర్వోలు వీఆర్ఏ ల ను పెన్నా నది వద్ద నిఘా ఉంచడం జరిగిందని ఆయన చెప్పారు.

 

Tags: Strict action will be taken if sand is moved illegally from Penna river

Post Midle