ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తే కఠిన చర్యలు

Strict measures are in danger of public health

Strict measures are in danger of public health

– కమిషనర్‌ వర్మ

Date:19/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ కెఎల్‌.వర్మ హెచ్చరించారు. గురువారం ఆయన పట్టణంలోని ఉబేదుల్లాకాంపౌండులో పర్యటించారు. ఈ సందర్భంగా నివాస గృహాల మధ్య పేడదిబ్బలు, మురుగునీటి నిల్వల్లో చెత్తవేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులచే శుభ్రం చేయించారు. స్థల యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో జ్వరాలు ప్రభలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీటి నిల్వల్లో లార్వలు పెరిగి, దోమలు తీవ్రమైందన్నారు. దీనిని నివారించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇలా ఉండగా ఇండ్ల యజమానులు పేడను, నిల్వ చేయడం, అందులో పశువులను కట్టి శుభ్రం చేయకపోవడంతో ఆ నీరు రోడ్లపై ప్రవహిస్తోందన్నారు. దీని ద్వారా దోమలు తీవ్రమైందన్నారు. ఈ విషయమై పలుమార్లు స్థల యజమానులకు హెచ్చరించిన ఫలితం లేకపోవడంతో కఠిన చర్యలు చేపట్టామన్నారు. పట్టణంలో మలేరియా, డెంగ్యూ దోమలను నివారించేందుకు పగటి పూట ఫాగింగ్‌ చేపట్టామని తెలిపారు. నీటి ట్యాంకుల్లో బ్లీచింగ్‌ చేస్తున్నామన్నారు. అలాగే ఫినాయిల్‌ వేసి ఎప్పటికప్పుడు దోమలను నివారించే కార్యక్రమం చేపట్టామన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు పూర్తిగా సహకరించాలన్నారు. తమ ఇండ్ల వద్ద ప్రజలు శుభ్రంగా ఉంచుకుంటే సమస్య పరిష్కారమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ , కార్మికులు పాల్గొన్నారు.

శ్రీ సాయిఆలయాలలో పూజలు

Tags: Strict measures are in danger of public health

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *