బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు  జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్ రెడ్డి

వర్ధన్నపేట ముచ్చట్లు :

బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై బాల్య వివాహాలను అరికట్టేందుకు సహకరించాలని,బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా బాలల సంరక్షణ అధికారి గాదె మహేందర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన దొనికెల విజయ కూతురుకి బాల్య వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్న సమాచారంతో వర్ధన్నపేట ఎస్ఐ వంశీకృష్ణ,జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్ రెడ్డి,ఐసీడీఎస్ సెక్టార్ సూపర్ వైజర్ స్వరూప,చైల్డ్ హెల్ప్ లైన్ సభ్యురాలు మమత కలిసి గ్రామంలోని విజయ నివాసానికి చేరుకొని కౌన్సిలింగ్ నిర్వహించి బాల్య వివాహాన్ని నిలిపివేశారు.జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బాలిక చదువు నిమిత్తం తగిన విధంగా సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. అనంతరం ఎస్ఐ వంశీకృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహాలు నిషేధమని,ఎవరైనా బాల్య వివాహానికి సహకారం అందించినట్లు అయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:Strict measures are not wrong if child marriages are committed
District Child Welfare Officer Mahender Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *