పర్యావరణానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date;21/11/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో పర్యావరణ కాలుష్యానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శనివారం ఆయన మున్సిపాలిటిలోని సచివాలయ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. అలాగే వైద్య సిబ్బందితో కూడ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలోని వ్యాపారులు ట్రేడింగ్‌ లైసెన్సు పొందాలన్న నిబంధన ఉన్న కొంత మంది పాటించలేదన్నారు. అలాగే విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ కప్పులు, కవర్ల వినియోగం జరుగుతున్నా సచివాలయ ఉద్యోగులు ఈ విషయమై సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు క్రమశిక్షణతో ప్రభుత్వ విధానాలను అమలు పరస్తూ ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. దుకాణాలు, హ్గటళ్ళు తనిఖీ చేయాలని, నాణ్యతలేని వస్తువులను విక్రయించినా, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాపారాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై స్పందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జ్వరాలు ప్రభలకుండ దోమలు నివారించేందుకు ఏఎన్‌ఎంలు, శానిటరీ ఉద్యోగులు కలసి చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండ చూడాలన్నారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌, సురేంద్రబాబు, ఎన్విరాల్‌మెంట్‌ ఇంజనీర్‌ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

భక్తి శ్రద్దలతో కార్తీకమాస పూజలు

Tags: Strict measures if it causes disturbance to the environment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *