మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవు
జయశంకర్ భూపాలపల్లి ముచ్చట్లు:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బిరసాగర్ గ్రామంలో శుక్ర వారం ఉదయం పోలీసులు నాఖబంది నిర్వహించారు. ఓ ఎస్ డీ గౌస్ ఆలం, మహాదేవ పూర్ డీ ఎస్ పీ రామ్ మోహన్ రెడ్డి, మహాదేవపూర్ సీ ఐ కిరణ్ కుమార్, అర్ ఐ సంతోష్, కాళేశ్వరం ఎస్ ఐ రాజేశం, పోలీస్ సిబ్బంది కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి లోని బీరసాగర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ( నాఖబంధి) కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమం లో ఓ ఎస్ డీ గౌస్ అలం గ్రామస్తులతో మాట్లాడుతూ 2022- డిశంబర్-2 వ తేదీ నుండి 8వ తేదీ వరకు సీ పీ ఐ మావోయిస్ట్ పార్టీ పీ అల్ జీ ఏ వారోత్సవాలు ఉన్నందున నక్సల్ కు ఎవరూ ఆశ్రయం ఇవ్వద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని, అనుమానిత వ్యక్తులు మరియు సంఘ విద్రోహక వ్యక్తులు ఎవరైనా గ్రామం లోకి వస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని, అలాంటి వారికి ఆశ్రయం కల్పించిన, వారికి సహకరించిన వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ చెడు వాసన వ్యసనాలకు గురికాకుండా, చెడు అలవాట్లవైపు వెళ్ళకుండా మంచి ఉన్నత చదువులు చదివించాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో ఓ ఎస్ డీ గ్రామ ప్రజల గురించి అడిగి తెలుసుకోగా మేమ ఇక్కడ వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని కొన్ని సమస్యలు ఉన్నాయని తెలపగా వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మహాదేవపూర్ డి ఎస్ పీ, మహాదేవపూర్ సిఐ లకు సూచించారు. గ్రామంలోని యువకులు పోలీసు శాఖ లోని పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష అర్హత సాధించిన వారు దేహదారుడ్య పరీక్ష కోసం మరియు ఫైనల్ రాత పరీక్ష కోసం బాగా కష్టపడి చదవి ఉద్యోగం సాధించాలని సూచించారు. వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలైన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తున్నందున ముందు నుండే ఒక ప్రణాళికతో బాగా చదివి ఉద్యోగం సాధించి గ్రామంలోని ఇతర యువతకు ఆదర్శంగా ఉండాలని తెలిపారు. గ్రామస్తులు స్వయం ఉపాధి పనులు మరియు కుటీర పరిశ్రమలు ఏర్పరచుకుంటే ప్రభుత్వం కొన్ని సబ్సిడీలు అందిస్తుందని అవి ఏర్పాటు చేసుకొని లబ్ది పొందాలని గ్రామస్తులకు తెలిపారు. కార్యక్రమంలో సివిల్ పోలీసు సిబ్బంది, టీ ఎస్ ఎస్ పీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Strict measures will be taken if they cooperate with Maoists
