Natyam ad

అలిపిరి మెట్ల మార్గం లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలి

– మెట్లు చివరి వరకు ఇరువైపులా పెన్సింగ్ ఏర్పాటు చేయాలి.

– సమాంతరంగా రోవ్ వే ను నిర్మించాలి.

– టిటిడి ఛైర్మన్ కు మాజీ ఎమ్మెల్సీ కే.జయచంద్ర నాయుడు సలహా.

 

Post Midle

తిరుమల ముచ్చట్లు:

తిరుమలకు నడకదారిలో భద్రత చర్యలు పటిష్టంగా చేపట్టాలని మాజీ ఎమ్మెల్సీ కందేరి జయచంద్ర నాయుడు టిటిడి నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కోరారు.రెండు రోజుల క్రితం చిరుత దాడికి రక్షిత అనే పదేళ్ల బాలిక మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.తిరుమల వంటి గొప్ప పుణ్యక్షేత్రాలలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆయన కోరారు.అలిపిరి మెట్ల మార్గంలో క్రింద ఉన్న మొదటి మెట్టు నుండి తిరుమల లోని చివరి మెట్టు వరకు దారి మొత్తం ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.తద్వారా వన్యప్రాణుల నుండి భక్తులకు రక్షణ కల్పించడంతో పాటు ప్రజలకు సంపూర్ణ భద్రత ఏర్పాటు చేసినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

 

అలాగే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అనవసర భేషాజాలకు పోకుండా అలిపిరి నుండి తిరుమల కు రోప్ వే ఏర్పాటు చేసి మెరుగైన వసతులు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.రోప్ వే ప్రతిపాదన ఆనాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కాలం నుండి రకరకాల రాజకీయ కారణాలతో 40 ఏళ్లుగా వాయిదా పడుతుండటాన్ని ఆయన గుర్తు చేశారు.భక్తులకు మెరుగైన సేవలు అందించడమే పరమావధిగా పనిచేసే టిటిడి ఛైర్మన్ రాజకీయాలకతీతంగా ఆలోచించి రోప్ వే ఏర్పాటు నిర్ణయం దిశగా అడుగులు వేయాలని భూమన కరుణాకర్ రెడ్డిని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

 

Tags:Strict security measures should be taken in the Alipiri stairway

Post Midle