Natyam ad

జోరుగా కల్తీ నూనె దందా

ఏలూరు ముచ్చట్లు:


వంట నూనెల కల్తీ వ్యాపారం జోరుగా సాగుతుంది. పలు కంపెనీల బ్రాండ్‌లను వినియోగిస్తూ కల్తీలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్లెల నుంచి వస్తున్న ప్రజలకు తక్కువ ధరలకు ఆశ చూపించి నాణ్యతలేని వంట నూనెలను విక్రయిస్తున్నారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం లలో 31 పైగా వంటనూనెల వ్యాపార సముదాయాలు ఈ దందాకు పాల్పడుతున్నట్లు తెలిసింది.కాకినాడ నుంచి వివిధ రకాల కంపెనీల నూనెను డ్రమ్ముల్లో జిల్లాకు జంగారెడ్డిగూడెం, చింతలపూడి మండలాల వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. పల్లి నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్, ఇతర తక్కువ ధరలకు లభించే నూనె డ్రమ్ములు హోల్‌ సేల్‌ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. సగం వేరు శనగ నూనెలో నాసిరకం నూనెను కలిపి మరో సారి మిల్లులో పోస్తారు. ఆ తరువాత బ్రాండ్‌ స్టిక్కర్లు అంటించి క్యాన్లలో ప్యాక్‌ చేస్తారు. అలాగే, లీటర్‌, అర లీటర్ ప్యాకెట్లు తయారు చేసి జంగారెడ్డిగూడెం, చింతలపూడిలలోని కిరాణా దుకాణాలకు సదరు వ్యాపారులు సరఫరా చేస్తున్నారు.జంగారెడ్డిగూడెం పట్టణంలో మార్కెట్, శ్రీనివాసపురం రోడ్డులో కల్తీ నూనెలను విక్రయిస్తూ అమ్మకందారులు జేబులో నింపుకుంటున్నారు. నాణ్యత ప్రమాణాల శాఖ ఉన్నప్పటికీ ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. ఆయిల్‌ మిల్లుల వ్యాపారులు, హోల్‌ సేల్‌గా ఆయిల్‌ తెచ్చి ఇక్కడే ప్యా క్‌ చేసి విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యాపారంలో ఆరితేరిన కొంతమంది రూ.కోట్లకు పడగలెత్తారు.

 

Tags; Strong adulterated oil

Post Midle
Post Midle