కౌంటింగ్ కు పటిష్టమైన ఏర్పాట్లు

Date:21/05/2019

వరంగల్ అర్బన్ ముచ్చట్లు:

ఈ నెల 23న వరంగల్ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి  పటిష్టమైన మూడంచెల బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్  తెలిపారు. మంగళవారం  ఏనుమాముల మార్కెట్ గోదాములలో నిర్వహించని కౌంటింగ్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. లోక్ సభ పరిధిలోని  ఏడు శాసనసభ సెగ్మెంట్ ల  అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, తహసిల్ధార్లతో పలు అంశాలు గురించి  చర్చించారు. స్ట్రాంగ్ రూంలను తెరచి ఇవిఎంలను బయటకు తెచ్చేటప్పుడు అభ్యర్ధుల, ఎన్నికల ఎంజెంట్లు, ఎన్నికల పరశీలకులు తప్పనిసరిగా అక్కడ ఉండాలని తెలిపారు. ప్రతి రౌండ్ లో 14 టేబుల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టేబుళ్లవారీగా లెక్కించాల్సిన ఇవిఎంలను కేటాయించినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ నుభారత ఎన్నికల సంఘం నియమించిన జనరల్ అబ్సర్వర్ తో పాటు కౌంటింగ్ అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు పరిశీలిస్తారని తెలిపారు.రౌండు వారీగా నమోదు అయిన ఓట్ల వివరాలను సువిధ పోర్టల్ ద్వారా అప్ లోడ్ చేయనున్నట్లు తెలిపారు.

 

 

 

 

కౌంటింగ్ సందర్భంగా ఓటింగ్ రహస్యాన్ని కాపాడాలని సూచించారు.  కౌంటింగ్ హాలులోకి వచ్చేందుకు ఎజెంట్లకు, కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మినహా కౌంటింగ్ హాలులో ఉన్న ఎంజెంట్ కు, కౌంటింగ్ సిబ్బందికి సెల్ ఫోన్లు అనుమతి లేదని తెలిపారు. సెల్ ఫోన్లను వాహనం లోనే ఉంచి రావలని ఎజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి సూంచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కె.వెంకారెడ్డి, ఎన్.రవికిరణ్, మహేందర్ రమేష్, వెంకటాచారి, మాలతి, విజయ్ కుమర్, శ్రీధర్, రాము, సమాచార పౌర సంబంధల శాఖ ఉప సంచాలకులు యాసా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించేది లేదు: తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

 

Tags: Strong arrangements for counting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *