పవన్ ఫాన్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ..

Strong counter to Pawan Fans

Strong counter to Pawan Fans

Date:14/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ దీటైన బదులిస్తున్నారు. పవన్‌తో విడాకుల విషయమై ఇటీవల రేణు చేసిన వ్యాఖ్యలు సంచలనమైన సంగతి తెలిసిందే. పవన్‌ను నేను విడాకులు అడగలేదని చెప్పిన రేణు.. పవర్ స్టార్ వ్యక్తిగత జీవితాన్ని తప్పుబడుతూ ఆరోపణలు చేసింది. ‘పదకొండేళ్లు తనతో కాపురం చేసిన వ్యక్తి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని తనతో ఇంకో పాపను కన్నాడు.. నా స్థానంలో మీరుంటే ఏం చేసేవార’ని ఆమె పవన్ ఫ్యాన్స్‌ను ప్రశ్నించిందిరేణు దేశాయ్ రెండో పెళ్లి వార్తలు బయటకు వచ్చిన దగ్గర్నుంచి పవన్ ఫ్యాన్స్ (లేదా ఆ పేరిట) కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో రేణు.. తన ఎంగేజ్‌మెంట్ తర్వాత ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేసింది. ఇటీవల స్వప్నతో చిట్ చాట్ అంటూ రేణు ఇచ్చిన ఇంటర్వ్యూను పవన్ ఫ్యాన్స్ తప్పుబట్టారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత రేణు దేశాయ్ అబద్దాలు చెబుతోందని పవన్ అభిమానులు ఆరోపించారు. పాప పుట్టిన తర్వాత పవన్‌కు ఫోన్ చేసి విష్ చేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన రేణు.. ఇటీవలి ఇంటర్వ్యూలో విడాకుల కంటే ముందే పోలినా పుట్టిందనడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ ఆరోపణల పట్ల రేణు వివరణ ఇచ్చారు. బేబీ పోలినా పుట్టింది 13 మార్చి 2012. [9 నెలలు అంటే గర్భధారణ అయ్యింది జులై 2011]. తర్వాత అంటే, 16 మార్చి 2012న విడాకులు ఖరారయ్యాయి. పాప పుట్టిన విషయం తెలిసిన తర్వాత రేణు పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్నే ఇంటర్వ్యూలో తెలియజేశార’’ని రేణు పీఆర్ టీం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనతో విడిపోవడానికి ముందే పవన్‌కు అన్నా లెజినోవాతో అనుబంధం ఉందని ఈ పోస్ట్ ద్వారా రేణు మరోసారి స్పష్టం చేసినట్టయ్యింది. విడాకులు రావడానికి ముందే పవన్ లెజినోవాతో కొత్త జీవితం ప్రారంభించారని రేణు పోస్టును బట్టి అర్థం చేసుకోవచ్చు. అటు పవన్ ఫ్యాన్స్, ఇటు రేణు దేశాయ్ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తే బాగుంటుంది. 8 ఏళ్ల క్రితం జరిగిపోయిన అంశం గురించి పట్టుకొని ఊగులాడటం వల్ల పొలిటికల్‌గా బలపడాల్సిన తరుణంలో పవన్ వీక్ అవుతాడు. నూతన జీవితాన్ని ప్రారంభిస్తోన్న రేణుపై కూడా అంతో ఇంతో ప్రభావం ఉంటుంది. అలా ఏం జరగదనుకున్నా.. క్రమంగా జనాలు ఆమెను పట్టించుకోవడం మానేస్తారు. ఇలా జరగొద్దంటే.. విడాకుల సమస్య పట్ల ఇరు వర్గాలు సమన్వయంతో వ్యవహరించడం ఒక్కటే పరిష్కారం.
పవన్ ఫాన్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ..https://www.telugumuchatlu.com/strong-counter-to-pawan-fans/
Tags: Strong counter to Pawan Fans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *