జగనన్నతోనే పటిష్టమైన విద్య -జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలతో పటిష్టమైన విద్య కార్యక్రమం అందించడం జరుగుతోందని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము తెలిపారు. సోమవారం యూబికాంపౌండులోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అలాగే గర్భవతులకు, బాలింతలకు జగనన్న పోషణ కిట్లను పంపిణీ చేశారు. అమ్ము మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పాఠశాలలకు మహర్ధశ పట్టిందన్నారు. ఎన్నడులేని విధంగా అంగన్‌వాడీ కేంద్రాలను పీప్రైమరీ పాఠశాలలుగా మార్చడం జరిగిందన్నారు. అలాగే నాణ్యమైన బోజనాన్ని పాఠశాలల్లో అందించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ అయిషా, సిబ్బంది పాల్గొన్నారు.

Tags; Strong Education with Jaganan – District Wakf Board Chairman Ammu
