Corona virus should not be taken lightly by countrymen: PM Modi

ఎన్ఈపీ2020ని ప‌టిష్టంగా అమ‌లు: ప‌రర ధాని మోదీ            

Date:11/09/2020

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:

21వ శ‌తాబ్ధంలో పాఠ‌శాల విద్య అన్న అంశంపై జ‌రిగిన స‌ద‌స్సులో ప్ర‌ధాని మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. జాతీయ విద్యావిధానం 2020లో భాగాంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.  కేంద్ర విద్యాశాఖ‌మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ ఈ స‌ద‌స్సులో పాల్గొన్నారు.  భార‌త దేశ కొత్త ఆకాంక్ష‌ల‌ను, ఆశ‌ల‌ను నిజం చేసే విధంగా కొత్త జాతీయ విద్యావిధానం ఉంద‌ని ప్ర‌ధాని తెలిపారు.  అంద‌రం క‌లిసి ఎన్ఈపీ2020ని దేశ‌వ్యాప్తంగా ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌న్నారు.  తమ ప్ర‌భుత్వం ఎన్ఈపీపై సూచ‌న‌లు కోర‌గా సుమారు 15 ల‌క్ష‌ల‌కుపైగా సూచ‌న‌లు వ‌చ్చిన‌ట్లు మోదీ చెప్పారు.  గ‌త 5 ఏళ్ల నుంచి వివిధ ద‌శ‌ల్లో సాగిన ప్ర‌య‌త్నం వ‌ల్లే ఎన్ఈపీ2020 సాధ్య‌మైంద‌న్నారు. ఇంకా ఈ ప‌ని పూర్తి కాలేద‌ని, ఇది ప్రారంభం మాత్ర‌మే అన్నారు. ఎన్ఈపీని ప‌టిష్టంగా అమ‌లు చేయ‌డమే మ‌నంద‌రి ముంద‌న్న బాధ్య‌త అని మోదీ తెలిపారు.  ప్రీ స్కూల్ అనేది చిన్నారులకు ఇంటి బ‌య‌ట‌ తొలి అనుభ‌వం అని, అయితే ప్రీ స్కూల్ స్థాయి నుంచే స‌ర‌దాగా చ‌దువు నేర్పే టీచ‌ర్లు కావాల‌న్నారు.  ఫ‌న్ లెర్నింగ్‌, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌, డిస్క‌వ‌రీ బేస్డ్ లెర్నింగ్ అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని తెలిపారు.

రాజారంలో క్రిస్టియన్ ప్రార్థన మందిర  పర్మిషన్ రద్దు చేయాలని వినతి పత్రం

Tags; Strong implementation of NEP 2020: Parrara Dhani Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *