సామాజిక, ఆర్థిక రంగాల్లో నిర్మాణాత్మక ఆవిష్కరణలు రావాలి

– వాటర్ రిసోర్సస్‌ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ప్రకాశ్ రావు
Date:20/10/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాకుండా సామాజిక, ఆర్థిక రంగాల్లో నిర్మాణాత్మక ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వాటర్ రిసోర్సస్‌ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ప్రకాశ్ రావు అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) ఆధ్వర్యంలో నాసా, స్మార్ట్ సిటీ అంశాలపై హాకథాన్ గ్రాండ్ ఫైనల్ జరిగింది. ప్రస్తుతం సామాన్య, శాస్త్ర రంగాల్లో అత్యాధునిక ఆవిష్కరణలు రావడం శుభపరిణామమని ఆయన అన్నారు. కానీ వ్యవసాయ, ఆరోగ్య పరమైన అంశాలను ఐటీకి అనుసంధానంతో కొత్త ఆవిష్కరణలపై యువత దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు.
ఐటీ రంగంలో కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించడానికి హాకథాన్ నిర్వహించామని టిటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల్ అన్నారు. దేశంలో అతి పెద్ద హాకథాన్ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. పది వేల మంది విద్యార్థులను ఎంపిక చేసి చివరగా వారి నుండి వెయ్యి మందితో 200ల ప్రాజెక్టులు గ్రాండ్ ఫైనల్‌కు చేరాయని ఆయన వివరించారు. వీటి నుంచి కొంత మందిని ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. నాసా, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులను ఎంపిక చేస్తుందని ఆయన వివరించారు.
Tags:Structural innovations in social and economic sectors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *