పుంగనూరులో ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు పోరాటం
పుంగనూరు ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం ఎస్సీవర్గీకరణ అమలు చేసే వరకు పోరాటం సాగిస్తామని ఎంఆర్‌పీఎస్ నాయకులు నరసింహులు, ఫృద్వీకుమార్ తెలిపారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మూడవ రోజు దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. నరసింహులు మాట్లాడుతూ ఎంఆర్‌పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నిరాహారదీక్షలు చేపట్టామన్నారు.100 రోజుల్లో వర్గీకరణ చేపడుతామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు. ఉధ్యమం తీవ్రం చేస్తామని , ఎంఆర్‌పీఎస్ , ఎంపీఎస్ సత్తా చాటుతామని హెచ్చరించారు. ఈ దీక్షా శిబిరంలో వెంకటేష్, గంగులప్ప, లక్ష్మన్న, గోవిందు, రాజన్న, మునస్వామి, నాగయ్య, మురళి, రామయ్య, మోహన్, మంజు, కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags: Struggle to achieve SC classification in Punganur
