రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు
వర్దన్నపేట ముచ్చట్లు:
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా, వర్దన్నపేట మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కూడికల శ్రీధర్ ముఖ్య అతిధిగా విచ్చేసి భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బూత్ స్వశక్తికరణ్ అభియాన్ విషయమై చర్చించి, నియోజకవర్గాల వారిగా నియోజకవర్గ కన్వీనర్ల నుండి బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ కార్యక్రమం వివరాలు తెలుసుకున్నారు.తరువాత రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి నీరుద్యోగ యువత పట్ల చిన్న చూపు అన్ని రంగాలలో విఫలమై ప్రజా వ్యతిరేక విధానలు జిల్లా కి చెందిన అసమర్ధత మంత్రి, ఎమ్మెల్యే లు మరియు మేయర్ విధానాలపై పలు తీర్మానలు ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానలను జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానలపై రాబోయే రోజుల్లో రూపకల్పన చేసి ఉద్యమ రూపంలో వాటి సమస్యల సాధనకై బీజేపీ వరంగల్ జిల్లా పార్టీ ఉద్యమిస్తుందని అని తెలిపారు.ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు చీటూరి రాజు, ఉపాధ్యక్షులు వెలమకాంటి గిరిప్రసాద్,జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపెల్లి రాజేశ్వర్రావు,జిల్లా నాయకులు మాజీ ఉపసర్పంచ్ కొండేటి సత్యం, జిల్లా ఎస్ సీ సెల్ ఉపాధ్యక్షులు ఐత రవికుమార్, సీనియర్ నాయకులు బోయినాపెళ్లి దేవేందర్రావు, వర్ధన్నాపేట సోషల్ మీడియా ఇంచార్జి బాల్లే విక్రమ్,పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లేపక అనిల్,సీనియర్ నాయకులు భూక్యా తేజ్య నాయక్, ప్రశాంత్, ఎస్ సెల్ పట్టణ అధ్యక్షులు కొండేటి బాబు, ఎస్ టీ సెల్ కార్యదర్శి అంగోత్ దేవేందర్,రవి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Struggles against state government failures
